Hanuman: ఏంటీ హనుమాన్ డైరెక్టర్ కి పెళ్లయిందా.. షాక్ లో లేడీ ఫ్యాన్స్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు హనుమాన్..ఈ చిత్రం తో పాటూ ఈ చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా బాగా పాపులర్ అయ్యారు. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం హనుమాన్.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న వచ్చిన ఈ సినిమాని అతి తక్కువ బడ్జెట్ తో విడుదల అయ్యి.. మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల కాకముందు వరకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎవరనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఇప్పుడు ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పేరును గుర్తుపట్టేలా చేసుకున్నారు. హనుమాన్ సినిమా సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. రూ .200 కోట్ల క్లబ్ లో చేరి కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్ సృష్టించింది.

హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడం తో ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సహితం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఒక్క సినిమాతోనే ఇంత గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ కి వివాహం అయ్యిందా? లేదా? అనే విషయం పై అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి వివాహమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంతోమంది చెప్పినప్పటికీ లేడీ ఫ్యాన్స్ మాత్రం నమ్మట్లేదు.

అయితే ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నమ్మాల్సి వచ్చిందని తెలుస్తోంది. హనుమాన్ సినిమాలో హీరోయిన్ అమృతా అయ్యర్ ని చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో అమ్మాయిల క్రష్ గా డైరెక్టర్ పేరు సంపాదించారు. ఇప్పుడు తాజాగా వివాహం అయ్యింది అని తెలిసి ఆయనను ఇష్టపడే అమ్మాయిల సంఖ్య రోజుకీ తగ్గుతోందట. ప్రశాంత్ వర్మ పెళ్లి ఫోటోలు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అమ్మాయిలు సైతం మొట్టమొదటిసారిగా ఒక డైరెక్టర్ తో క్రష్ అనుకున్నాము కానీ ఆయనకి వివాహమైందని తెలిసి చాలా బాధపడుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా తన తదుపరి చిత్రం జై హనుమాన్ ని వచ్చే ఏడాది మళ్ళీ సంక్రాంతి బరిలోనే దింపబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాని కూడా స్టార్ కాస్టింగ్ తోనే తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ.. దాదాపుగా పదేళ్లపాటు .తన సినిమాలు ఏడాదికి ఒకటి చొప్పున విడుదల అవుతాయని తెలిపారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు