Thaman: సరదా సరదాకే రవి బసృర్ ను తగులుకున్నారు , నువ్వు జాగ్రత్త థమన్ అన్న

 

ఎస్ ఎస్ థమన్.. మణిశర్మ, రాజ్ కోటి వంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేసి కిక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. థమన్ తన కెరియర్లో చాలా త్వరగా 100 ఫిలిమ్స్ కంప్లీట్ చేశాడు. ఒక టైం లో తమన్ ఫాస్ట్ చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కేవలం చిన్న సినిమాలు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ మహేష్ బాబు రవితేజ వంటి హీరోల సినిమాలకు కూడా థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే థమన్ వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో కొంత గ్యాప్ వచ్చింది.

థమన్ మ్యూజిక్ ఒకే విధంగా ఉంటుంది అంటూ కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. ఇకపోతే తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని థమన్ చేసిన సినిమా తొలిప్రేమ. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమా పాటలు అద్భుతంగా అందించాడు థమన్. అయితే థమన్ చేసిన 99 సినిమాలు ఒకెత్తు థమన్ చేసిన 100వ సినిమా అరవింద సమేత వీర రాఘవ సినిమా ఓక ఎత్తు. ఎందుకంటే అరవింద సమేత వీర రాఘవ సినిమాతో తమన్ కి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.

- Advertisement -

అరవింద సమేత తర్వాత థమన్ రేంజ్ కూడా మారిపోయింది. త్రివిక్రమ్ అరవింద సమేత తర్వాత చేసిన అలవైకుంఠపురంలో సినిమాకి కూడా థమన్ సంగీతం అందించాడు. అయితే అల వైకుంఠపురంలో పాటలు బీభత్సంగా హీట్ అయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టేక్ అప్ చేసిన ప్రతి ప్రాజెక్టుకి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అలానే అద్భుతమైన మ్యూజిక్ ని కూడా అందించాడు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో థమన్ కి ఉన్న రేంజ్ వేరు. థమన్ కేవలం బిజియమ్స్ తోనే సినిమాని ఒక రేంజ్ లో లేపుతున్నాడు అంటూ చాలా మంది ట్విట్టర్ వేదిక వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు.

ఇకపోతే థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం థమన్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ గుంటూరు కారం అండ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి. ఇకపోతే గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇకపోతే రీసెంట్గా సలార్ సినిమా రిలీజ్ అయింది. అయితే సలార్ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించాడు. అయితే సలార్ సినిమా మ్యూజిక్ కొంతమేరకు నిరాశపర్చినట్లు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ తరుణంలో రవి బసృర్ నే వదల్లేదు గుంటూరు కారం సినిమాకి మంచి మ్యూజిక్ ఇవ్వకపోతే నిన్ను కూడా ట్రోల్ చేస్తారన్న అంటూ థమన్ ను చిన్నగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది ఫ్యాన్స్.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు