Ram : హరీష్ శంకర్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ మూవీ ఫిక్స్?

రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో వారియర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతుంది. ఈ మూవీలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పూర్తయ్యాక రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇది ఏకంగా పాన్ ఇండియా మూవీ. దీని తర్వాత చేయబోయే ప్రాజెక్టు ని కూడా రామ్ సెలెక్ట్ చేసేసుకున్నట్టు వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నట్లు వినికిడి.

ఈ మధ్యనే రామ్ ను కలుసుకుని కథ చెప్పాడట హరీష్ శంకర్. అది రామ్ కు నచ్చింది. భవదీయుడు భగత్ సింగ్ అయిన వెంటనే హరీష్, బోయపాటి సినిమా అయిన వెంటనే రామ్… కలిసి సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్లు అన్న పేరే కానీ పాపం బోయపాటి, హరీష్ శంకర్ లకి మొదటి నుండీ స్టార్ హీరోలు దొరకరు. వీళ్ళకి దొరికిన హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు