మెగాస్టార్ చిరంజీవి
ఈ పర్సనాలిటీ తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం
ఈయన లేకపోతే తెలుగు సినిమాని ఊహించలేము,
మాములు సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లే నటుడు,
నాలుగు తరాలు పాటు సినిమా ప్రపంచాన్ని నడిపిస్తూ,
అభిమానులకు అంతులేని ఆనందాన్ని ఇస్తున్నారు,
ఒక నటుడిగానే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఆయన మెగాస్టారే.
అటువంటి వ్యక్తి తనయుడైన రామ్ చరణ్ కూడా ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నాడు, సింప్లిసిటీ కి కేరాఫ్ అడ్రెస్ అనిపించుకుంటున్నాడు.
మనలో చాలామంది మా నాన్న చిరంజీవి అయితే బాగుణ్ణు అని అనుకుంటారు. కానీ నువ్వు రామ్ చరణ్ లా అయితే మాత్రం బ్రతకలేవు.
పొరపాటున ఒక తప్పు చేసిన చిరంజీవి కొడుకు అని ఒక టాగ్ తగిలిస్తారు. అందుకే అన్ని దగ్గర పెట్టుకుని బ్రతకాలి, అదే రంగంలోకి రాణించాలి. ఈ రెండు చరణ్ చేయగలిగాడు కాబట్టే ఆయనకు కూడా ఇప్పుడు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
రంగస్థలం, ట్రిపుల్ ఆర్ సినిమాతో తనలో నట విశ్వరూపాన్ని చూపించిన రామ్ చరణ్, ఆఫ్ స్క్రీన్ లో తన సింప్లిసిటీ ను చూపిస్తున్నాడు. రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్పస్వామి మాల వేస్తుంటారు. రీసెంట్ టైమ్‌లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తర్వాత కూడా ఆయన మాలలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇప్పుడు రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ పరమేశ్వరుడి ఆలయంలో ఉన్నారు. ఆలయంలో శివ లింగాన్ని నీటితో శుద్ధి చేస్తున్నారు. కొన్ని సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో చూసిన నెటిజన్స్ ‘‘సూపర్ స్టార్ డమ్‌కి సింప్లిసిటీ ఓ ట్రేడ్ మార్క్. రామ్ చరణ్ పలువురు సెలబ్రిటీలకు రోల్ మోడల్’’ అంటూ చరణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Simplicity is the trademark of super stardom.. doing Shivalaya Seva is such a change from seeing temple run photo ops.. #RamCharan is a role model for celebs too 🙌🙌🙌#HarHarMahadevॐ pic.twitter.com/6xVvDIHbKa
— Bishamber Valmiki (@BishamberMla) May 13, 2022