కేజీఎఫ్-2.. ఓ ప్రభంజనం
కన్నడలో చిన్న హీరోగా ఉన్న యష్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన దర్శకున్ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది. సౌత్ సినిమాలంటే తక్కువేమీ కాదు అని నిరూపించి, హిందీ ప్రేక్షకులతో కూడా సలాం కొట్టించుకుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా లేవెల్ లో రిలీజై, నిన్నటితోనే 5వ వారంలోకి అడుగు పెట్టింది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ ఐదు వారాల్లో 1,180.83 కోట్లను వసూళ్లు చేసి, ‘ఆర్ఆర్ఆర్’ ను వెనక్కి నెట్టింది. దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్-తారక్ మల్టీ స్టారర్ గా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 50 రోజులను పూర్తి చేసుకుని 1,127 కోట్ల కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. కేజీఎఫ్-2 మొదటి వారంలో 720.31 కోట్లు, రెండో వారంలో 223.51 కోట్లు, మూడో వారం 140.55 కోట్లు, నాలుగో వారంలో 91.26 కోట్లు వసూళ్లు చేసింది. అలాగే ఐదో వారంలో కూడా రాకీ భాయ్ జోష్ తగ్గలేదు. కేజీఎఫ్-2 ఈ ఐదో వారం తొలి రోజు 5.20 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
మన దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన మూడో సినిమా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ నిలిచింది. దీనికంటే ముందు 2,024 కోట్లతో అమీర్ ఖాన్ ’దంగల్’, 1,810 కోట్లతో రాజమౌళి – ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘బాహుబలి – 2’ రెండో స్థానంలో ఉన్నాయి.