Virupaksha: హిట్ మూవీని చేజార్చుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరంటే?

గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ “విరూపాక్ష” మూవీ 2023 బ్లాక్ బస్టర్ టాలీవుడ్ సినిమాల లిస్టులో చేరిన విషయం తెలిసిందే. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ అయిన “విరూపాక్ష” మూవీ ఎలాంటి జిమ్మిక్కులు లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ మూవీ మే 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఓటీటీలో కూడా ఈ హారర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీని ఓ స్టార్ డైరెక్టర్ చేజర్చుకున్నాడట. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఎందుకు ఈ మూవీని చేజార్చుకున్నాడు? అంటే…

ఎప్పుడో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటే… తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కార్తీక్ దండు ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు. డైరెక్టర్ క్రిష్ నిర్మాతగా వ్యవహరించాల్సిన ఈ మూవీ సుకుమార్ దగ్గరకు ఎలా వెళ్ళింది అనే విషయాన్ని వివరించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే… ముందుగా “విరూపాక్ష” స్టోరీని తీసుకుని డైరెక్టర్ కార్తీక్ దండు స్టార్ డైరెక్టర్ క్రిష్ దగ్గరకు వెళ్లారట. ఆ స్టోరీ నచ్చకపోవడంతో క్రిష్ రిజెక్ట్ చేశారట. అయితే డైరెక్టర్ కార్తీక్ దండు ఈ స్టోరీని తీసుకుని క్రిష్ దగ్గరకు వెళ్ళింది ఆయన దర్శకత్వం చేయాలని కాదు, నిర్మాతగా వ్యవహరించాలని. కానీ క్రిష్ మాత్రం కార్తీక్ స్టోరీని రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత ఈ స్టోరీ సుకుమార్ దగ్గరకు వెళ్లడంతో ఆయన ఒక్క కండిషన్ మీద ఈ సినిమాను నిర్మిస్తానని ఒప్పుకున్నారట.

- Advertisement -

ఆ కండిషన్ ఏమిటంటే మూవీ స్క్రిప్టును మార్చడం. నిజానికి ఈ మూవీ కథ వేరేగా ఉందట. కానీ సుకుమార్ ఈ స్క్రిప్ట్ లో వేలు పెట్టి, కథను మార్చేసారట. ఫలితంగా డైరెక్టర్ కార్తీక్ దండు ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఇక నిర్మాతగా సుకుమార్ ఖాతాలోను మంచి కంటెంట్ ఉన్న హిట్ పడింది. ఒకవేళ డైరెక్టర్ క్రిష్ కూడా ఇలాంటి పని చేసి ఉంటే, ఆయన కూడా నిర్మాతగా ఈ ఏడాది మంచి సక్సెస్ అందుకునేవాడు. కానీ ఈ మూవీ సుకుమార్ కే రాసిపెట్టినట్టు ఉంది. అందుకే క్రిష్ రిజెక్ట్ చేయడం, ఆ స్టోరీ సుకుమార్ దగ్గరకు రావడం, ఆయన స్టోరీలో కావలసినట్టుగా మార్పులు చేర్పులు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం చూసి కచ్చితంగా క్రిష్ బాధపడే ఉంటారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు