Vijay Kanth – Rajinikanth: విజయ్ కాంత్ – రజినీకాంత్ మధ్య వున్న బంధం ఏంటంటే..?

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాదు తమకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్న అతి కొద్ది మంది సీనియర్ స్టార్ హీరోలలో విజయ్ కాంత్ , రజనీకాంత్ ఒకళ్ళు అని చెప్పవచ్చు. వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఎంత మంచి పాపులారిటీ దక్కించుకున్నారో అంతే మంచి ఫ్యాన్ బేస్ కూడా సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా విజయ్ కాంత్, రజనీకాంత్ సినిమాలు విడుదలయ్యాయి అంటే చాలు బాక్సాఫీస్ వద్ద పోటీ భీభత్సంగా ఉండేది. అంతేకాదు కొన్ని విషయాలలో వీరిద్దరూ సమానంగా ఉండేవారు. అలా వీరిద్దరిని చూసిన చాలా మంది అన్నదమ్ములు అని కూడా అనేవారు.

ఇకపోతే విజయ్ కాంత్ కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత తన తండ్రి నిర్వహిస్తున్న రైస్ మిల్లులో కూలీల పనులు చేసేవారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. తమిళ సినిమాల్లోకి రాకముందు విజయకాంత్ తలైవా రజినీకాంత్ కు వీరాభిమాని.. ఆయన అభిమాన సంఘం కోశాధికారిగా కూడా పనిచేశారు. అంతేకాదు విజయకాంత్ అచ్చం రజినీకాంత్ లాగే ఉంటారని చాలామంది అనేవారు. అందుకే ఆయనను బ్లాక్ రజనీకాంత్ అని కూడా పిలుస్తారు. విజయ్ కాంత్ ను రజనీకాంత్ మొదటిసారి చూసినప్పుడు.. నువ్వు అచ్చం నాలాగే ఉన్నావని అన్నారట. దాంతో విజయ్ కి కూడా సినిమాల్లో నటించాలన్న ఆశ పెరిగింది. ఆ పట్టుదలతోనే సాధించి చూపించారు విజయ్ కాంత్.

తనలా ఉన్నావని రజినీకాంత్ అనడంతో పాటు బయట వారు కూడా రజనీకాంత్ లా ఉన్నావనేసరికి తన అసలు పేరు అయిన విజయ రాజు కి రజనీకాంత్ లోని కాంత్ ను జోడించి విజయకాంత్ గా మారిపోయారు. అంతలా అభిమానం ఉండేది ఆయనకు.. ఆ తర్వాత రజనీకాంత్ ని చూస్తూ ఇండస్ట్రీలోకి వచ్చి తన పేరును మరింత పరిచయం చేసుకున్న విజయ్ కాంత్.. ఏకంగా రజనీకాంత్ తో పోటీపడి మరీ సినిమాలను నిర్మించేవారు. దీన్ని బట్టి చూస్తే ఆయనలోని కృషి పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో 1978లో మొదటి అవకాశాన్ని అందుకున్న ఈయన .. ఈ సినిమా తర్వాత మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. రీల్ హీరోనే కాదు రియల్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

ఇక స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత చిన్న , పెద్ద అని తేడా లేకుండా అందరి దర్శకులను, నిర్మాతలను కూడా సమానంగా ఆదరించేవారు. ఫ్లాప్ లకు భయపడకుండా కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చారు . ఇక ఈ లక్షణాలు రజనీకాంత్ లో కూడా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఒకానొక సమయంలో తమిళనాడు రజినీకాంత్ కంటే కూడా ఎక్కువ అభిమానులు కలిగి ఉన్న హీరోగా విజయకాంత్ రికార్డు సృష్టించారు. అలా మొత్తం 156 సినిమాలలో నటించారు విజయ్ కాంత్. మొత్తానికైతే రూపురేఖల్లో విజయకాంత్ రజినీకాంత్ ఓకే లాగా ఉండడంతో అభిమానులందరూ వీరిద్దరిని అన్నదమ్ముల్లాగా చూసేవారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు