Boby: మెగా బ్రదర్స్ అనుబంధం గురించి ఈ స్టార్ డైరెక్టర్ మాటల్లో..

Director Bobby talking about Mega Brothers bonding

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నయ్య చిరంజీవి లాగే అడుగుజాడల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగి ఆయన లాగే ఎంతో మందికి ఇన్స్పైర్ అయ్యాడు. ఇప్పుడు అటు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి వెళ్ళాక కొందరు ప్రతిపక్ష నాయకులు, ఇంకా గిట్టని వాళ్ళు తమ టీవీ ఛానల్లతో మెగా బ్రదర్స్ గురించి పోనీ పుకార్లను పుట్టించి మెగా ఫ్యాన్స్ మధ్య కూడా చిచ్చు పెడుతున్న విషయం తెలిసిందే.

ఈ విషయంపై భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది తనదైన శైలిలో కౌంటర్ వేయగా, వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పడం ద్వారా సమాధానం చెప్పాడు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఓ ఇంట్లో జరుగుతున్న సమయంలో ఆ ఇంటి ఓనర్ వచ్చి షూటింగ్ లో పాల్గొన్న అందరిని చెప్పులు వేసుకొని పని చేస్తున్నారు, అంటూ కొందరతో గొడవపడి తిట్టారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా హర్ట్ అయ్యి షూటింగ్ నుంచి వెళ్లిపోయారు.

ఈ విషయం తరువాత గంటకి మెగాస్టార్ చిరంజీవికి తెలిసింది. దీంతో ఆ ఇంటి ఓనర్ ఫోన్ నెంబర్ తీసుకొని వెంటనే ఫోన్ చేసి అతనితో మెగాస్టార్ ఇలా అన్నాడు. సినిమా షూటింగ్ లకి ఇల్లు అద్దెకి ఇచ్చిన తర్వాత అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా నా తమ్ముడిని అవమానిస్తావా అంటూ అతనిని తిట్టారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి అంత ప్రేమ ఉంది. తనని ఎవరైనా ఏమైనా అంటే క్షమిస్తారు. కానీ తమ్ముడు విషయంలో మాత్రం చిరు తన ఉగ్రరూపం చూపిస్తారని, బాబీ స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి గురించి, ఈ ఇన్సిడెంట్ జరిగిన విషయాన్ని రివీల్ చేశాడు.

- Advertisement -

ఇక ఈ స్పీచ్ వీడియోని మెగా అభిమానులు సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఇక భోళా శంకర్ సినిమా ఆగష్టు11న విడుదలకి రెడీ అవుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు