Bhola shankar pre release event: భజన బ్యాచ్ వల్ల మెగా స్టార్ కు తిప్పలు

Bhola shankar pre release event

అభిమాన హీరో ఎదురుగా ఉంటే, ఆ హీరో గురించి తమపై వాళ్ల అభిమానాన్ని చెప్పుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం మాత్రం కొంతమందికే వస్తుంది. అయితే ఆ అవకాశం వస్తున్న కొంతమంది మాత్రం ఆ అభిమాన హీరో గురించి మాట్లాడటం మానేసి వాళ్ళకు భజన చేయటమే పనిగా పెట్టుకుంటున్నారు.

స్టేజ్, మైక్ దొరకడమే ఆలస్యం ఇక ఆ హీరో మెప్పు పొందటానికి వీళ్ళు పడే తిప్పలు అంత ఇంత కావు. నిత్యం వారి భజన చేస్తూ, చూసే వాళ్లకు కూడా విరక్తి వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మహా మహానుభావులు. అయితే ప్రస్తుతం ఇలాంటి కొంతమంది భజనాభిమానుల ఛట్రంలో చిక్కుకున్నాడు మెగా స్టార్ చిరంజీవి.

అవును ! చిరంజీవి గొప్ప నటుడు.. ఈ విషయంపై ఎవరు సర్టిఫికెట్ ఇవ్వవలసిన పనే లేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా వివరించాల్సిన పని అంతకన్నా లేదు. ఇక ఆయన సినిమాల కలెక్షన్ ల గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయనపై వచ్చిన వివాదాల గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటిని నిన్న జరిగిన భోళా శంకర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో తీసి చిరంజీవిని ఇబ్బంది పెట్టాడు కమెడియన్ హైపర్ ఆది.

- Advertisement -

అభిమాన హీరో సినిమాలో అవకాశం దొరకడమే గొప్ప అనుకోని ధన్యవాదాలు చెప్పుకొని, స్టేజ్ దిగకుండా.. మర్చిపోయిన, మసకబారిపోయిన మెగా స్టార్ గత విషయాలను తవ్వి తీసి మరి ఆయనను ఇబ్బంది పెట్టాడు ఈ క్రింది స్థాయి అగ్ర నటుడు హైపర్ ఆది.

జబర్దస్త్ షో పుణ్యమా అని కాస్త పాపులర్ అయిన హైపర్ ఆది. ఆ తరువాత మెగా ఫ్యామిలీ అభిమానినని చెప్పుకుంటూ ఈ మధ్య కాలంలో స్టేజ్ ల పై అవాకులు చవాకులు పేలుస్తూ.. హైలెట్ అవుతున్నాడు. ఇక నిన్న సాయంత్రం జరిగిన భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో నైతే అసందర్భానుసారంగా, అనవసర వ్యాఖ్యలు చేసి మెగా స్టార్ చిరంజీవిని చాలా ఇబ్బందికి గురి చేసాడు కమెడియన్ హైపర్ ఆది.

అప్పట్లో పవన్ కళ్యాణ్ భజన చేస్తూ హైలెట్ అయిన బండ్ల గణేష్ భజనను మరిపించేలా స్టేజ్ లపై హైపర్ ఆది స్పీచ్ లు ఇస్తు హైలెట్ అవుతున్నాడు ఈ యాక్టింగ్ చేతకాని ఆణిముత్యం. ఇప్పటికే మెగా స్టార్ తాను చేస్తున్న సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తుంటే.. హైపర్ ఆది&కో భజన బ్యాచ్ మాత్రం చిరంజీవిపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా మెగా స్టార్ స్పృహలోకి వచ్చి ఈ భజన బ్యాచ్ ను దూరం పెడితే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు