Karthika Marriage: మళ్ళీ బాలయ్య మిస్… ఈ హీరోయిన్లు అంతా చిరు మీదే పడతారేంటి?

మళ్ళీ బాలయ్యను మిస్ చేశారు. ఈ హీరోయిన్లు అంతా చిరుపైనే పడతారెందుకు? అసలు బాలయ్యకు, చిరుకు మధ్య ఈ గ్యాప్ ఏంటి ?

అలనాటి తార రాధా కూతురు కార్తీక నాయర్ వివాహం తాజాగా కన్నుల పండుగగా జరిగింది. అక్కినేని నాగచైతన్య ఫస్ట్ మూవీ జోష్ తో కార్తీక హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది. రంగం వంటి హిట్ సినిమాలో నటించినప్పటికీ కార్తీకను ఎందుకో పెద్దగా అవకాశాలు పలకరించలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించ లేకపోయిన హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.

నిజానికి తెలుగులో కార్తీకకు కెరీర్ స్టార్టింగ్ లో మంచి అవకాశాలే వచ్చాయి. ఎన్టీఆర్ తో ‘దమ్ము’ అనే సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. తమిళ ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడంతో, సినిమాలు మానేసి దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయింది. ఇక చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాను ప్రేమించిన రోహిత్ మీనన్ తో తాజాగా మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు కూడా నడిచేసింది. నవంబర్ 19న తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కేరళ సంప్రదాయ పద్ధతిలో కార్తీక, రోహిత్ మీనన్‌ల వివాహం జరిగింది.

- Advertisement -

ఇక కార్తీక – రోహిత్ వివాహం తాజాగా కేరళలోని త్రివేండ్రంలో జరగగా, ఈ సెలబ్రిటీ వివాహానికి అలనాటి తారలంతా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి వంటి అలనాటి హీరో హీరోయిన్లంతా పెళ్లికి హాజరై ఈ కొత్త జంటకి ఆశీస్సులు అందించారు. ఇక చాలాకాలం తర్వాత వీరంతా కలవడంతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

అలనాటి తారలంతా కలిసి ఒకే ఫ్రెంట్ లో కనిపించడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలలో బాలయ్య మిస్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఎలాంటి ఫంక్షన్ జరిగినా కూడా బాలయ్య అందులో ఉండకపోవడం గమనార్హం. పైగా అప్పటి హీరోయిన్లు అంతా సదరు వేడుకల్లో చిరు పైపైన పడి మరీ ఫోటోలు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు