మెగాస్టార్ చిరంజీవి, ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘సైరా’, కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘ఆచార్య’ సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఇందులో ‘సైరా’ పర్వాలేదనిపించింది. కానీ, ‘ఆచార్య’ మాత్రం నిరాశపరిచింది. దీంతో చిరు తర్వాత సినిమాల పై ఫోకస్ పెట్టారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ చిత్రాలు త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రాలకి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. కాకపోతే మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ‘భోళా శంకర్’ చిత్రానికి మాత్రం బ్రేక్ లు పడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
అందుకు కారణాలు లేకపోలేదు, చిరంజీవి ఆచార్య ఫ్యాన్స్ ను నిరాశపర్చడంతో, తర్వాత సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే భోళా శంకర్ స్టోరీలో అలాంటి ఎలిమెంట్స్ లేక పోవడంతో చిరు అసంతృప్తితో ఉన్నారట. దీంతో ఈ ప్రాజెక్ట్ ను కొద్ది రోజుల వరకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని చిత్ర సీమలో టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇది నిజమని తెలియాలంటే, మేకర్స్ నుండి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.