మహేష్ బాబుకు సినీ నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ మధ్య చెడిందనే వార్త గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వారి కాంబోలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ చిత్రమే అని తెలుస్తుంది. విషయంలోకి వెళ్తే, ఈ మూవీ విషయంలో నిర్మాతలు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, టైటిల్ దగ్గర్నుంచి పాటలు ఇలా చాలా విడుదలకు ముందే లీక్ అయ్యాయని దీనికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అలాగే సినిమా విడుదల రోజు ముందు నుండి ‘డిజాస్టర్ ఎస్వీ పి’ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీని వల్ల ఈ సినిమాకు మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ, మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, సమ్మర్ హాలిడేస్ కలిసి రావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి.
సినిమా విడుదల అయ్యాక భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేయడంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ విఫలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ బ్యానర్ లో నటించిన హీరోలతో ట్వీట్స్ వేయిండంలోనూ మైత్రీ వారు సక్సస్ కాలేదని వాదన. టికెట్ల ధరలను సాధారణంగానే ఉంచాలని మహేష్ అండ్ కో చెప్పినా, మైత్రీ వాళ్లు పట్టించుకోలేదట. దీనికి తోడు ఇక సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే అమెజాన్ లో రెంటల్ పద్ధతిలో ‘సర్కారు వారి పాట’ ని రిలీజ్ చేసి థియేట్రికల్ రన్ పై దెబ్బ కొట్టారని ఓ వ్యతిరేకత కూడా ఉంది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ పై మహేష్ క్లాస్ కూడా పీకినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. ఈ కారణాల వల్లే నాని ‘అంటే సుందరానికి!’ ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబు రావాల్సినప్పటికీ.. అతను నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ ను మైత్రి మూవీ మేకర్స్ ఒప్పించి తీసుకొస్తున్నారని సమాచారం.