Allu Arjun: పుష్ప2 తర్వాత బన్నీ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారని వార్తలొస్తున్నప్పటికీ అఫీషియల్ అనౌన్సమెంట్ అయితే ఇంకా రాలేదు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తర్వాత సినిమా త్రివిక్రమ్ తో చేయనున్నాడని, అది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. మరో పక్క దసరా సినిమా ద్వారా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉండనుందని కూడా టాక్ వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకులకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో శ్రీకాంత్ చిరు కోసం ఒక కథ సిద్ధం చేయాలని భావించగా అనుకున్న సమయానికి స్క్రిప్ట్ పూర్తి కాకపోవటం వల్ల మెగాస్టార్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో నెక్స్ట్ సినిమా కమిట్ అయ్యాడట. దీంతో శ్రీకాంత్ బన్నీ కోసం కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడట.
అల్లు అర్జున్ తో ఈ మేరకు స్టోరీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. దసరా సినిమా ద్వారా నానిలోని మాస్ యాంగిల్ ని బయట పెట్టిన శ్రీకాంత్ బన్నీ కోసం కూడా ఫుల్ లెన్త్ మాస్ స్టోరీని సిద్దం చేసే ప్లాన్ లో ఉన్నాడట. శ్రీకాంత్ సిద్ధం చేయబోయే స్క్రిప్ట్ కి గనక బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్రివిక్రమ్ సినిమా తర్వాత అల్లు అర్జున్ శ్రీకాంత్ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు