Lady Superstar: నయనతార ప్లేస్ లో మరో హీరోయిన్..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 20 ఏళ్లుగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటుతోంది నయనతార. ఏజ్ పెరుగుతున్న కొద్దీ  క్రేజ్ కూడా పెంచుకుంటూ వెళుతుంది ఈ స్టార్ హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా సంపాదించుకుంది. అంతేకాదు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు సంపాదించుకుంది.

ఇక పెళ్లి తర్వాత కూడా నయనతార తగ్గేదేలే అనే విధంగా సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ప్రస్తుతం నయనతార చేతిలో 9 సినిమాలు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది నయనతార. ఇవే కాకుండా శశికాంత్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా నయనతార ప్రధాన పాత్ర పోషిస్తుంది.

హీరోయిన్ ఓరియంటెడ్ కధా చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో నటుడు మాధవ్, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు చిత్రవర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే తాజాగా కొన్ని అనివార్య కారణాలవల్ల నయనతారను చిత్రబృందం పక్కనపెట్టిందట. ఆమెకు బదులుగా ఈ చిత్రంలో రాశిఖన్నా ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు