Allu Ayaan: అల్లు అయాన్ ఎంట్రీకి సర్వం సిద్ధం..!

సినీ ఇండస్ట్రీలో సినీ వారసత్వం ఎక్కువ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.. అందులో భాగంగానే చాలామంది హీరోలు కూడా తమ వారసులను ఇండస్ట్రీకి తీసుకొస్తూ సక్సెస్ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో కొంతమంది టాలెంట్ ఉండి ఉన్నత స్థానానికి చేరుకుంటే.. మరి కొంతమంది బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. టాలెంట్ ఉపయోగించుకోవడంలో తప్పటడుగులు వేసి ఫెయిల్యూర్ గా నిలుస్తున్నారు.. అయితే ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త వారసులు అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే అల్లు ఫ్యామిలీ నుంచి కూడా మరో వారసుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీల పిల్లలకు ఈ ప్లాట్ఫామ్ పాపులారిటీ సంపాదించుకోవడానికి అత్యుత్తమ వేదికగా మారిపోయింది. అందుకే చాలామంది సెలబ్రిటీల పిల్లలు సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిభను చాటుకుంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియాను చక్కగా వాడుకుంటూ అతి చిన్న వయసులోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు కూతురు సితారతో పాటు అల్లు అర్జున్ కూతురు అర్హ అలాగే కొడుకు అయాన్ లు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారనటంలో సందేహం లేదు.

ఇప్పటికే అల్లు అర్హ.. సమంత -గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన శాకంతులం సినిమాలో భరతుడి చిన్నప్పుడు పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు కూతురు బాటలోనే కుమారుడు కూడా రాబోతున్నట్లు సమాచారం.. పుష్ప 2 సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో అయాన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సీన్స్ ను టెస్ట్ షూట్ చేసిన సుకుమార్ ఓకే చెప్పినట్టు సమాచారం.. ఇకపోతే గతంలో వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణను పరిచయం చేసిన సుకుమార్ ఇప్పుడు పుష్ప2 సినిమాతో అల్లు అర్జున్ కుమారుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నారు.. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

- Advertisement -

ఇక అల్లు అర్జున్ సినిమాలో విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన ఈయన.. ఈ సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.. అంతేకాదు తెలుగు నుంచి ఈ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేశారు బన్నీ.. ఇక ఈ మూవీకి కొనసాగింపు పుష్ప 2 మూవీ రాబోతోంది. ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.. ఆ తర్వాత బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగా లతో పాటు సురేందర్ రెడ్డితో రేసుగుర్రం 2 సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు