Akhil : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాంబో రిపీట్?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. కానీ, ఈ హీరో మొదటి హిట్టు అందుకోవడానికి 6 ఏళ్ళ టైం పట్టింది. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలు పర్వాలేదు అనిపించాయి. కానీ, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో అఖిల్ కు మొదటి సక్సెస్ అందించిన ఘనత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కే దక్కింది. ‘జి ఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో గతేడాది.. వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం అఖిల్ కు మంచి విజయాన్ని కట్టబెట్టింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీ. ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ రిపీట్ కానుంది అనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా జరుగుతుంది. 
 
ఈ మధ్యనే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. అఖిల్ కు ఓ కథ వినిపించాడట. దానికి అఖిల్ గ్రీన్ సింగల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని సమాచారం. హిట్ ఇచ్చిన దర్శకులకి హీరోలు తొందరగా నొ చెప్పలేరు కదా. దాంతో ఈ ప్రాజెక్టు సెట్ అయిపోయింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అని తెలుస్తుంది. దీంతో పాటు ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు మోహన్ రాజాతో కూడా.. అఖిల్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లు వినికిడి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు