NTR31: పుస్తకం పేరే సినిమా టైటిలా.?

మనదేశం కథలకి పుట్టినిల్లు, ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించే నిమిత్తం ఒక కథలోంచి మరొక కథను చెప్పుకుపోయే చాతుర్యం మనదేశానికి ఉన్నంతగా మరే దేశానికీ లేదని ఘంటాపదంగా చెప్పొచ్చు.
ఇది మన దేశం మీద ఉన్న మక్కువతో చెబుతున్న మాట కాదు, ఇతర దేశాల్లోని పరిశోధకులు ఒప్పుకున్న మాట.

భారతదేశ చరిత్రలో ఎన్నో గొప్ప పుస్తకాలు ఉన్నాయ్, ఎన్నో గొప్ప కథలు ఉన్నాయ్, వాటిలో కొన్నింటిని సినిమాలుగా మలిచి హిట్ కొట్టిన సంధర్భాలు కూడా ఉన్నాయ్. ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఒక సినిమాని తీయడం తేలికైన విషయం కాదు, కాగితంపై అక్షరాలను చల్లడానికి ఊహ ఉంటే చాలు, కానీ దానిని వెండితెరపై ఆవిష్కరించాలంటే ఊహా మాత్రమే సరిపోదు అంతకు మించి ఇంకేదో కావాలి. యండమూరి వీరేంద్రనాథ్ , యద్దన పూడి సులోచన రాణి లాంటి రచయితల పుస్తకాలను ఆధారంగా చేసుకుని అప్పట్లో సినిమాలు చేసేవారు. ఈ మధ్యకాలంలో అది కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు.

కానీ ఇండస్ట్రీ లో కొంతమంది స్టార్స్ హీరోలకి పుస్తకాలు చదివే అలవాటు ఉన్నట్లు స్వయంగా వాళ్ళే వెల్లడించిన సందర్భాలున్నాయి.
ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో “జై లవకుశ” సినిమాని చేస్తున్నప్పుడు
తాను ఆనంద్ నీలకంఠన్ రాసిన “అసురుడు” అని పుస్తకాన్ని చదవడం వలనే, ఆ సినిమాలో “రావణ” పాత్రను అంతలా చేయగలిగాను అని చెప్పుకొచ్చాడు అప్పట్లో, ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న సినిమాకి “అసురుడు” అనే అదే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు