Faria Abdullah : సక్సెస్ వచ్చింది – అవకాశాలు లేవు

ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం సక్సెస్ఫుల్ పీపుల్ కే కెరియర్ ఉంటుంది అంటారు. కానీ కొంతమందికి హిట్ సినిమా పడినా కూడా అవకాశాలు అంత త్వరగా రావు. “జాతిరత్నాలు” సినిమాతో హిట్ అందుకున్న ఫరియా అబ్దుల్లాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. “జాతి రత్నాలు” హిట్ తరువాత ఆమె ఏ సినిమాలో పెద్దగా కనిపించలేదు, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” లో ఒక చిన్న రోల్ లో కనిపించిన ఫరియా, “బంగార్రాజు” సినిమాలో నాగార్జున, నాగ చైతన్యతో స్పెషల్ సాంగ్ చేసింది.

ప్రస్తుతం ఫరియా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న “ధమాకా” సినిమాలో రవితేజకి చెల్లి గా నటించనున్నట్లు సమాచారం. ఇందులోనే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫరియా అబ్దుల్లా పాత్ర, ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ ను అతి త్వరలోనే ప్రారంభిస్తారట. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఈ సినిమాతో అయినా, ఫరియాకు మంచి అవకాశాలు వస్తాయా అంటే, అది కూడా డౌటే. ఒక సీనియర్ హీరో సినిమాలో చేయడం, అది కూడా చెల్లి పాత్ర, కాబట్టి సినిమా హిట్ అయినా, చిట్టి పేరు రావడం కష్టమే అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు