Jagapathi Babu : టాలీవుడ్ మ్యాన్లీ స్టార్ జగపతి బాబు వరుస సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా దూసుకుపోతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో లెజెండ్ తో ప్రతినాయకుడిగా మారిన ఈయన వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోలకు ప్రతినాయక పాత్రలకు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ గా మారారు ఈయన. రంగస్థలం, నాన్నకు ప్రేమతో, మహర్షి వంటి సినిమాలలో తన విలనిజం తో మెప్పించడమే గాకుండా, సౌత్ లోనే ఒక బెస్ట్ విలన్ అనే రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. ఇక జగపతి బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా జగపతి బాబు సత్తా చాటుతున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తో పాటు హిందీ తో సహా అన్ని భాషల్లో విలన్‌గా నటిస్తున్నాడు. కానీ జగపతి బాబుకి మళ్లీ తన సత్తాను చాటుకునే పాత్ర అయితే రావడం లేదు. ఈ మధ్య మరీ రొటీన్ విలన్‌గా కనిపిస్తున్నాడు. మొన్నా మధ్య సలార్ లో స్ట్రాంగ్ గా కనిపించినా, ఆ సినిమాలో తక్కువ నిడివిలో కనిపించడం జరిగింది.
గుంటూరు కారంపై జగ్గూభాయ్ అసంతృప్తి..
అయితే ఈ మధ్య జగపతి బాబు చేస్తున్న పాత్రలలో వేరియషన్స్ కనిపించకపోవడంతో రియలైజ్ అయ్యాడు. అందుకే జగపతి బాబు కూడా అలాంటి సాదాసీదా, రొటీన్ పాత్రలను ఎంచుకోవడం లేదు. అయితే ఈ మధ్య సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం‘ సినిమాలో జగపతి బాబు అలా కనిపించీ కనిపించనట్టుంటాడు. అయితే విడుదలకు ముందు గుంటూరు కారం సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి జగపతి బాబు ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. కానీ సినిమా చూస్తే కనీసం జగపతి బాబుకు ఓ ఐదారు సీన్లు కూడా సరైనవి పడి ఉండవు. పట్టుమని పది నిముషాలు కూడా అయన సీన్లు లేవు. ఇక మహేష్ బాబు జగపతి బాబు సీన్లు అయితే ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అసలు సినిమాకు త్రివిక్రమ్ అనుకున్న కథ వేరు.. రాసుకున్న కథ వేరు.. తీసిన సినిమా వేరు.. చివరకు ఏదో ఒక సినిమాను గురూజీ తీసి ప్రేక్షకుల మీదకు వదిలేశాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి తాజాగా జగపతి బాబు స్పందించాడు.
మళ్ళీ అలాంటి పాత్రలు చేయకుండా జాగ్రత్త..
ఓ బాలీవుడ్ మీడియా కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన జగపతి బాబు గుంటూరు కారం మూవీ గురించి మాట్లాడాడు. మహేష్ బాబుతో తనకు ఎప్పుడూ పని చేయాలనే కోరిక ఉంటుందని, కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే, గుంటూరు కారం సినిమాను తాను ఎంజాయ్ చేయలేకపోయానని, తనకు మహేష్ బాబుకి మధ్య ఉన్న సీన్లను ఎంజాయ్ చేయలేకపోయానని, మహేష్ బాబు లాంటి వాడితో చేస్తే మంచి పాత్రనే చేయాలన్నట్టుగా, ఛాన్స్ వేస్ట్ చేసుకోకూడదన్నట్టుగా జగపతి బాబు అన్నాడు. ఇక అలాగే సలార్ పార్ట్ 2 గురించి కూడా ప్రస్తావిస్తూ సలార్ రెండో పార్ట్‌లో తనకూ, ప్రభాస్‌కు మధ్య మంచి సీన్లు ఉంటాయని, ఫుల్ ఎమోషనల్‌గా ఉంటాయని, రెండో పార్ట్ మ్యాజికల్‌గా ఉంటుందని హైప్ పెంచేస్తున్నాడు జగపతి బాబు. అయితే ఒకప్పుడు నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి సినిమాల్లో ఒక్క ఫైట్ కూడా చేయకుండా తన విలనిజాన్ని తన ఆహార్యంతోనే పండించిన జగపతి బాబు మళ్ళీ ఆ రేంజ్ పాత్రలు ఎప్పుడు చేస్తారో అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.