గత ఏడాది ప్రముఖ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేసిన విషయం తెలిసిందే.. ఇకపోతే సాధారణంగా బాలకృష్ణ అంటే ప్రత్యేకమైన ఇమేజ్ ఒకటి ఉంటుంది.. ఆయన చేతిలో కత్తి పెట్టి , డైలాగులు చెప్పిస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. అలాంటి ఇమేజ్ ని బ్రేక్ చేద్దామనుకున్న ప్రతిసారి కూడా బాలకృష్ణకి చేదు అనుభవాలే మిగులుతున్నాయి.. అయితే మీకు ఒక సందేహం రావచ్చు.. ఇలాంటివేవీ లేకుండా ఆధ్యాత్మిక ధోరణిలో భైరవద్వీపం , టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆదిత్య 369 సినిమాలు హిట్ అయ్యాయి కదా.. అంటే అదంతా ఒక్కప్పటి మాట.. అయితే ఇప్పుడు కంప్లీట్ గా బాలయ్య సినిమాలంటే కేవలం ఇందాక చెప్పిన పాటర్న్ లో మాత్రమే ఉండాలని అభిమానులు ఫిక్స్ అయ్యారు
బాలయ్యను వాడుకోవడంలో విఫలం..
ఇక అందుకే బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టుగా బోయపాటి శ్రీనునే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయారు. గోపీచంద్ మలినేని కూడా బోయపాటి స్టైల్ లోనే వీర సింహా రెడ్డి సినిమా చేశారే తప్ప కొత్తగా ఆయన చేసింది ఏమి లేదు.. అందుకే బాలయ్య ను కొత్తగా చూపించాలని విఫలమయ్యారు గోపీచంద్ మలినేని..
కొత్త యాంగిల్ లో చూపించింది అనిల్ మాత్రమే..
అయితే దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం భగవంత్ కేసరి సినిమాతో కొత్త బాలయ్యను చూపించడంలో 100% సక్సెస్ అయ్యారనటంలో సందేహం లేదు.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు రూ.60 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగి రూ.70 కోట్ల వరకు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు భారీగా థియేటర్లలో పేలాయి.. యాక్షన్ సీన్స్ కూడా అనిల్ చాలా కొత్తగా డిజైన్ చేశారు..
అన్నీ ఉన్నా అసంతృప్తి..
అయితే ఇదంతా బాగానే ఉన్నా ఈ సినిమా రిజల్ట్ పై దర్శకుడు అనిల్ రావిపూడి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇటీవల ఒక సినిమా ఈవెంట్ లో భాగంగా భగవంత్ కేసరి కలెక్షన్ల గురించి మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశారు.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి ఉంటే ఖచ్చితంగా రెట్టింపు స్థాయి లో కలెక్ట్ చేసేది.. ఇక కలెక్షన్ల విషయంలో మాత్రం అసంతృప్తిగానే ఉంది అంటూ అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.. మొత్తానికైతే తన మనసులో మాట బయటపెట్టారు.. ఒకరకంగా చెప్పాలి అంటే కలెక్షన్ల విషయంలో సంక్రాంతికి విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా ఈ సినిమా రెట్టింపు స్థాయిలో వసూల్ చేసి ఉండేది.. మరోవైపు వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసినప్పటికీ కూడా ఈ సినిమా కంటే ఎక్కువగా భగవంత్ కేసరి సినిమా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది.. ఏది ఏమైనా భగవంత్ కేసరి సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయలేదనే అసంతృప్తి తనలో ఎక్కువగా ఉందని పరోక్షంగా తెలిపారు అనిల్ రావిపూడి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.