Rakul Preet Singh: హనీమూన్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ రోజుకి ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?

Rakul Preet Singh: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్‌గా మారింది రకుల్ ప్రీత్ సింగ్. ముంబైలో సినిమాలు చేస్తుండగా అక్కడే పరిచయమైన బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరిద్దరూ ఏడు అడుగులు వేసి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇప్పటికీ వీరిద్దరికీ తీరిక దొరికిందో ఏమోగానీ ఎట్టకేలకు హనీమూన్‌కు వెళ్లారు. సాధారణంగా సెలబ్రిటీలంతా వెళ్లే కంట్రీస్‌కు భిన్నంగా ఫిజీ ఐల్యాండ్స్‌కు జాకీ భగ్నాని, రకుల్ ప్రీత్ సింగ్ హనీమూన్‌కు వెళ్లారు. వెళ్తే వెళ్లారుగానీ.. ఈ హనీమూన్‌కు సంబంధించి వీరు చేసిన ఖర్చు చూసి అంతా అమ్మ బాబోయ్ అంటున్నారు. ట్రావెలింగ్ ఖర్చు, హోటల్ ఖర్చు, రిసార్ట్స్ బిల్ అంతా కలిసి రోజుకు దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేసిందట ఈ జంట. హనీమూన్ అంటేనే ప్రైవసీ.. ఈ ప్రేమ పక్షుల చుట్టుపక్కల కూడా మరెవరూ ఉండకుండా చుట్టుపక్కల హోటల్స్, రిసార్ట్స్‌ను కూడా బుక్ చేసేసుకున్నారట వీళ్లిద్దరూ.

మరోవైపు ఈ హనీమూన్‌కు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌‌గా మారాయి. వెరీ వెరీ బోల్డ్‌‌గా ఉండడంతో ఇప్పుడివే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. ప్రైవసీ కోసం కోట్లు ఖర్చు చేసిన రకుల్ ప్రీత్ సింగ్, బట్టల్లో మాత్రం చాలా పొదుపు పాటిస్తూ బాడీని మొత్తం ఎక్స్‌పోజ్ చేసింది. గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్. ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటూ పోస్ట్ కూడా పెట్టింది. సెలబ్రిటీల హనీమూన్ అంటే ఇంతే అని కొందరు అంటుండగా.. భర్త సమక్షంలో మరీ ఇంత బరితెగించాలా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరీ ఇంత బరితెగించాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లోనూ హిట్ మూవీస్‌లో నటించింది. పెద్ద పెద్ద స్టార్ట్ అందరితోనూ సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ప్రస్తుతం సౌత్‌లో ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అయింది. హిందీలో అడపా దడపా సినిమాలు చేస్తోంది. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’లో కూడా రకుల్ నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు