Bangarraju: థియేటర్స్ లో తిరస్కరణ – టెలివిజన్ లో ఆదరణ

కొన్ని సినిమాలు ఎన్నో అంచనాలు మధ్య రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడతాయి. ఇంకొన్ని సినిమాలు ఏ మాత్రం అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబడతాయి.
కొన్ని సినిమాలకి థియేటర్స్ లో ఉన్నప్పుడు ఆదరణ లభించదు,
దీనిలో మొదటి వరుసలో ఉండేవి త్రివిక్రమ్ చేసిన అతడు , ఖలేజా సినిమాలు. కానీ టీవీ లో వేసిన ప్రతిసారి ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వస్తాయి.

అలానే రీసెంట్ గా రిలీజైన కొన్ని సినిమాలు కూడా ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో సత్తాను చూపించని సినిమాలు టెలివిజన్ లో మాత్రం మంచి టీఆర్పీ ను తీసుకొచ్చాయి.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు,
ఆ సినిమాకి ప్రీక్వెల్ గా వచ్చిన సినిమా “బంగార్రాజు” ఈ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

కానీ టెలివిజన్ లో మాత్రం ఈ సినిమాకి భారీ స్పందన లభించింది.
రీసెంట్ గా వచ్చిన మూవీస్ టీఆర్పీ లిస్ట్ లో “బంగార్రాజు” మొదటి స్థానంలో ఉంది బంగార్రాజు 14, అఖండ 13.31, డీజే టిల్లు 10.83
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ 9.30 , భీమ్లా నాయక్ 9.06.
రిలీజైన రోజునుంచే భీమ్లా నాయక్ సినిమాకి మంచి టాక్ వచ్చింది.
కానీ ఈ సినిమాకి టెలివిజన్ లో తక్కువ రేటింగ్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు