NTR30 : బన్నీ మిస్ చేసుకున్నాడా..?

కొన్ని సినిమాలు కొందరి హీరోలకే సెట్ అవుతాయి. బాలయ్య అఖండ చేస్తే బ్లాక్ బస్టర్ అయింది. అదే సంపూర్ణేష్ బాబు చేస్తే, కామెడీ అయ్యేది. ఇలా ప్రతి సినిమాపై చేసే హీరో పేరు ఉంటుంది. నిజానికి డైరెక్టర్లు కూడా హీరోలకు అనుగుణంగానే స్టోరీని రెడీ చేసుకుంటారు. అయితే ఆ స్టోరీలు నచ్చక చాలా మంది హీరోలు రిజెక్ట్ చేస్తారు. సూపర్ హిట్ అయ్యాక, ఆ సినిమా నేను చేయాల్సింది. అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను అంటూ బాధ పడతారు.

ఇలా రిజెక్ట్ చేయడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, అరవింద సమేత వీర రాఘవ, గీత గోవిందం లాంటి సినిమాలను బన్నీ తిరస్కరించాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ ముందు సెన్సెషన్ క్రియేట్ చేశాయి. అయితే తాజా గా ఐకాన్ స్టార్ మరో సినిమాను మిస్ చేసుకున్నాడట.

కొరటాల శివ-తారక్ కాంబోలో NTR30 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ స్టోరీని ముందుగా అల్లు అర్జున్ కు కొరటాల వినిపించాడట. అయితే స్టోెరీలో మార్పులు చేయాలని బన్నీ సూచించాడని తెలుస్తుంది. అయితే కథలో మార్పులు చేయడం కొరటాలకు నచ్చక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

- Advertisement -

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కొరటాల శివతోనే బన్నీ చేయనున్నాడట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం టైంలో ఉస్మానియా విద్యార్థుల పోరాట స్ఫూర్తితో కొరటాల స్టోరీని రెడీ చేస్తున్నారని సమాచారం. పూర్తిగా స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని ఫిలిం నగర్ లో చర్చ నడుస్తుంది. ఇది వాస్తవమో.. కాదో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు