Sreemukhi : శ్రీముఖిని ప్రేమించి మోసం చేసిన హీరో అతనేనా?

బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఈమె నటిగా కొన్ని సినిమాలు చేసింది. ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్’ వంటి సినిమాలు బాగానే ఆడాయి. ఇంకొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అసలు అవి రిలీజ్ అయినట్టు కూడా జనాలకి తెలీదు.

అయితే బుల్లితెర పై ఈమె క్లిక్ అవ్వడం, వరుస షోలలో ఈమెకు ఆఫర్లు దక్కడంతో సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా ఎక్కువగా ఈమె అంగీకరించడం లేదు. గతేడాది చివర్లో వచ్చిన ‘మాస్ట్రో’ మూవీలో ఈమె నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ చిత్రంలో కూడా చిన్న పాత్ర పోషిస్తుంది.

ఇదిలా ఉండగా.. శ్రీముఖి ‘బిగ్ బాస్3’ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ కు ఈమె రన్నర్ అప్ గా నిలిచింది. అయితే ఆ షోలో ఉన్నప్పుడు.. తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి కూడా శ్రీముఖి చెప్పుకొచ్చింది. ‘ ఓ హీరో తనని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనే టైంకి వదిలేసాడని, దాంతో ఈమె డిప్రెషన్ కు వెళ్ళిపోయి, సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్టు’ ఈమె చెప్పుకొచ్చింది.

- Advertisement -

శ్రీముఖి సన్నిహిత వర్గాన్ని ఆరా తీయగా ఈమెను మోసం చేసిన హీరో తనీష్ అని తేలింది. ‘బిగ్ బాస్2’ లో ఇతను కూడా టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే హీరోగా ఒకటి, రెండు హిట్లు పడ్డ టైంలో తనీష్.. శ్రీముఖిని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాడని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు