Type of Nose – Your Personality: మీ ముక్కే మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది !

ముక్కు ఆకారం మన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుందనే విషయం తెలుసా? సాధారణంగా మనం ముక్కు అనగానే వాసన చూడడానికి, ఫేస్ లో హావభావాలు తెలియడానికి మానవ శరీరంలో ఉన్న ఒక భాగం అని మాత్రమే అనుకుంటాం. కానీ ఈ ముక్కును చూసే మనుషుల స్వభావం ఏంటో ఇట్టే పసిగట్టేయొచ్చు. నిటారుగా, పదునుగా, మందంగా లేదా పొట్టిగా.. ఇలా ఒక్కోక్కరి ముక్కు ఒక్కోరకంగా ఉంటుంది. మరి ముక్కు ఆధారంగా మీ ఎదుట ఉన్నవారు ఎలాంటి వారో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

స్ట్రెయిట్ నోస్

ముక్కు నిటారుగా ఉంటే అతను సాధారణ స్వభావం కలిగి ఉంటాడు. అలాంటి వారు తమ అభిప్రాయాలను ఎవరికీ సులభంగా చెప్పరు. ఈ వ్యక్తులు సహనంతో ముందుకు సాగుతారు. ఈ వ్యక్తుల మనస్సులలో ఏముందో కనుగొనడం కష్టం. ప్రేమ, రిలేషన్స్ ను వీళ్ళు నిలబెట్టుకోలేరు.

- Advertisement -

వంకర ముక్కు

వంకర ముక్కు ఉండే వారు వంకర అనే పదానికి పూర్తి వ్యతిరేకం. వీళ్ళు స్ట్రాంగ్ గా ఉండడడమే కాకుండా దాతృత్వం, మంచితనం కలిగి ఉంటారు. అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటప్పుడు మొరటుగా ఉండరు. ఇంకా విషయాలను క్లిష్టతరం చేయడం ఇష్టం ఉండదు. వీళ్ళ వ్యక్తిత్వం కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్. వాస్తవానికి వంకర ముక్కుతో ఉన్న చాలా మంది వ్యక్తులు మంచి కీర్తిని సాధించారు.

కండకలిగిన ముక్కు / లావుగా ఉండే ముక్కు

కండకలిగిన ముక్కు ఉన్నవారు పదునైన ఆలోచనాపరులు, తెలివైనవారు, అప్రమత్తంగా ఉంటారు. ఉదారంగా, దయతో, సున్నితత్వంతో, భావోద్వేగంతో ఉంటారు, కానీ వారికి బాగా దార్రాగైనా వ్యక్తులు మాత్రమే ఈ లక్షణాలను అనుభవించగలరు. సాధారణంగా రూమర్స్ కు దూరంగా ఉంటారు. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, ఆదా చేస్తారు.

బటన్ నోస్

బటన్ నోస్ అంటే నోస్ పాయింట్స్ పైకి ఉంటాయి. బటన్ ముక్కు ప్రపంచంలోనే అందమైన ముక్కు మాత్రమే కాదు, వాళ్ళ వ్యక్తిత్వం కూడా చాలా అందమైనది. దృఢ సంకల్పం, సంకల్పంతో జీవితంలో చాలా ఆశాజనకంగా ఉంటారు.

హాక్ నోస్ / చిలుక/లేదా గ్రద్ద ముక్కు

చిలుక వంటి ముక్కు ఉన్నవారు చాలా తెలివైనవారు. అలాంటి వ్యక్తికి కోపం ముక్కు మీద ఉండిపోతుంది. అలాంటి వ్యక్తులు స్వచ్ఛమైన హృదయంతో ఉన్నప్పటికీ. విజయం సాధించాలంటే కష్టపడాలి.

చిన్న లేదా స్నబ్ నోస్

చిన్న ముక్కు ఉన్న వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. అలాంటి వారు ఎలాంటి చింత లేకుండా జీవితాన్ని గడుపుతారు. అయితే అలాంటి వారు ఇతరుల దృష్టిలో చిరాకు పడుతున్నారు. అలాంటి వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరు.

పెద్ద ముక్కు

పెద్ద ముక్కు ఉన్నవారు చాలా చురుకుదనం కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు నిజాయితీపరులు, నమ్మదగినవారు. అయితే అలాంటి వ్యక్తులు ఎవరినైనా విశ్వసించే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు.

 

Type of Nose Your Personality Your nose says what kind of person you are!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు