Love Life tips : ఓదార్పుకు, ప్రేమకు తేడా ఏంటో తెలుసా?

ప్రేమ, ఓదార్పు… ఈ రెండూ వేరువేరు భావోద్వేగాలు, కానీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కానీ చాలామందికి వీటి మధ్య తేడా ఏంటో తెలీదు. ఫలితంగా ఎవరితోనైనా కంఫర్ట్ గా ఫీల్ అయితే వాళ్లతో ప్రేమలో ఉన్నట్టుగా పొరబడతారు. మరి ఈ రెండింటికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? హాయిగా ఉండే కంఫర్ట్ జోన్ నే ప్రేమ అనుకుంటున్నారా? లేదంటే నిజంగానే ప్రేమను ఫీల్ అవుతున్నారా అనే విషయాలను ఎలా తెలుసుకోవాలి? అంటే సైకాలజీ ప్రకారం ఇప్పుడు చెప్పబోయే కొన్ని లక్షణాల ద్వారా ప్రేమలో ఉన్నారా లేదంటే ప్రేమగా ఫీల్ అవుతున్నారా అనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటి అంటే…

1. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు సాధారణంగా ఒకరి ఆశయాలకు మరొకరు సపోర్టును ఇవ్వడం, కలిసి జీవితాన్ని నిర్మించుకోవడం వంటివి చేస్తారు. ఒకవేళ మీ రిలేషన్ లో ఇవన్నీ లేకుండా, మీరు మీ పార్ట్నర్ తో రొమాంటిక్ లవర్ గా కాకుండా కేవలం రూమ్ మేట్ గా భావించే రిలేషన్ షిప్ లో ఉంటే మీది ప్రేమ కాదు. కేవలం మీరు ఓదార్పుని ప్రేమగా భావిస్తున్నట్టు అర్థం.

2. కొంతమంది కన్వీనియన్స్ ను బేస్ చేసుకుని ఉండే రిలేషన్స్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి రిలేషన్ కంఫర్ట్ గా, ఈజీగా ఉంటుంది. అలాగే రొటీన్ కు సరిగ్గా సెట్ అవుతుంది. ఎలాంటి డ్రామాలు అక్కర్లేకుండా లైఫ్ లో పెద్దగా మార్పులు అవసరం లేకుండా ఉంటుంది.

- Advertisement -

కానీ నిజమైన ప్రేమలో గొడవలు, రాజీ పడడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడం, హద్దులు దాటడం, రిస్క్ తీసుకోవడం వంటివి ఉంటాయి. ఎందుకంటే మీ జీవితంలో మరొక వ్యక్తికి చోటు కల్పిస్తున్నారు కాబట్టి. మరి మీరు ఈ రెండిట్లో ఏ వైపు ఉన్నారో చూసుకోండి.

3. ప్రేమ పూర్వక సంబంధంలో ఇద్దరూ ఒకరి ఎమోషనల్ నీడ్స్ మరొకరు తీర్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే భావోద్వేగ సానిహిత్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, దానిని పాటిస్తారు.

కానీ లోతైన భావద్వేగ అంశాలకు దూరంగా ఉండడం, కలత చెందినప్పుడు పార్టనర్ నుంచి సానుభూతి లేదా అవగాహన లేకపోవడం, ప్రశంసలకు కురిపించకపోవడం, తరచుగా ప్రేమను వ్యక్తం చేయకపోవడం, ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ ఒంటరితనం ఫీల్ అవ్వడం వంటివి మీ రిలేషన్షిప్ లో ఉన్నాయంటే అది ఖచ్చితంగా ప్రేమ కాదు.

4. నిజమైన లవర్స్ మధ్య ప్రియురాలిని/ప్రియుడిని కోల్పోతామేమో అన్న ఆలోచన వస్తే భయంకరంగా ఉంటుంది. అంటే వాళ్లతో అంత డీప్ గా కనెక్ట్ అయ్యారని అర్థం. మనం ప్రేమించే వారు లేకుండా జీవించాలి అనే ఆలోచనను కూడా తట్టుకోలేరు.

కానీ కన్వీనియన్స్ కోసం రిలేషన్ లో ఉంటే విడిపోవాలి అనే ఆలోచన అంత భయాన్ని కలిగించకపోవచ్చు. అంటే కాస్త అసౌకర్యంగా అనిపించినప్పటికీ నిజంగా ప్రేమించే వ్యక్తిని కోల్పోయినప్పుడు కలిగే తీవ్రమైన భయం లేదా విచారణ ఈ రిలేషన్ లో ఉండదు. మరి మీ రిలేషన్ ఓదార్పా ? నిజమైన ప్రేమా?

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు