Kiss Day 2024 : ఎక్కడ ముద్దు పెడితే ఎలాంటి అర్థం వస్తుందంటే?

Kiss Day 2024

వాలెంటైన్స్ వీక్ మొదలైపోవడంతో లవర్స్ అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ వాలెంటైన్స్ వీక్ మొత్తాన్ని ఫాలో అవుతూ తమ ప్రియురాలిని సంతోషంలో ముంచెత్తడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాలెంటైన్స్ వీక్ లో ముఖ్యమైన రోజు కిస్ డే. ఫిబ్రవరి 13న కిస్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. మరి అసలు ముద్దుకు అర్థం ఏంటి? ఎక్కడెక్కడ ముద్దు పెడితే ఎలాంటి అర్థం వస్తుంది? అసలు కిస్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముద్దు అనేది ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక ముఖ్యమైన మార్గం. నుదుటిపై పెట్టే సున్నితమైన ముద్దు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారు, ఎంతగా ఆధారపడి ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన వ్యక్తి నుదుటిపై ముద్దు పెట్టుకుంటే దాని అర్థం వారి జీవితంలో మీరు ఎంతో విలువైన వారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ మీ లవర్ అలా చేశాడంటే అతను మీకోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడని అర్థం.

భుజంపై ముద్దు అనేది ఇష్టమైన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయడానికి నిదర్శనం. చెంప మీద ముద్దు పెడితే అది స్నేహానికి సూచన. అరచేతిపై ముద్దు పెట్టడం అంటే మీ సెలక్షన్ ను సూచిస్తుంది. లిప్ టు లిప్ కిస్ అంటే ఇది అత్యంత ఉద్వేగమైనది. ఈ రొమాంటిక్ కిస్ మీలో ఉన్న గాఢమైన భావోద్వేగ సంబంధాన్ని బయట పెడుతుంది. అలాగే శృంగార వాంఛను మరింతగా పెంచుతుంది.

- Advertisement -

మరి ముద్దు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయంలోకి వెళ్తే… కిస్ వల్ల చర్మం మరింత యవ్వనంగా కనిపిస్తుంది. ముద్దు పెట్టుకునే సమయంలో ముఖంలో ఉన్న 30 కంటే ఎక్కువ కండరాలు కదులుతాయట. ఫలితంగా అది ముఖంపై ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెరగడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. రెగ్యులర్ గా కిస్ చేయడం అనేది నోటికి, గొంతుకు మంచి వ్యాయామం అవుతుంది. ముద్దు వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా ఒత్తిడి తలనొప్పిని తగ్గించడానికి కిస్ హెల్ప్ అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కిస్ పెట్టుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే ముద్దులు పెట్టుకోవడం వల్ల మెదడులో విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనీన్ వల్ల మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు