Chitra Shukla.. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అటు పెళ్లి చేసుకొని ఇట్టే గర్భం ధాలుస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈ జాబితాలోకే మరో హీరోయిన్ వచ్చి చేరింది. తాజాగా తాను గర్భం దాల్చాను అంటూ ఆ మధుర క్షణాలను అభిమానులతో ఫోటోల రూపంలో పంచుకుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ చిత్ర శుక్ల (Chitra Shukla) టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో “మా అబ్బాయి ” అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అటు నుంచి వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
సీమంతం చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్..
అహో విక్రమార్క అనే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్ర మధ్యప్రదేశ్ కి చెందిన అమ్మాయి. తాజాగా గర్భం దాల్చాను అంటూ తెలిపిన ఈమె.. ఘనంగా సీమంతం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె మధ్యప్రదేశ్ కి చెందిన పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది గత సంవత్సరం డిసెంబర్ లో వీరి వివాహం జరగగా.. తాజాగా సాంప్రదాయ పద్ధతిలో సీమంతం వేడుకలను చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చిత్ర సీమంత వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం చిత్ర సీమంతం వేడుకకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు చిత్ర శుక్ల, వైభవ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే కన్నయ్యను ఆహ్వానించాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శుక్ల సీమంతం వేడుకకు సంబంధించిన ఈ ఫోటోలు అందంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రేమ వివాహం చేసుకున్న చిత్ర శుక్ల..
ఇక చిత్ర శుక్ల విషయానికి వస్తే.. ఈమె ఇండస్ట్రీ లోకి రాకముందు మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత డాన్స్ ఇండియా డాన్స్ షోలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 2017 లో వచ్చిన మా అబ్బాయి అనే సినిమా ద్వారా తొలిసారి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. 1996 సెప్టెంబర్ 5న నరేంద్ర శుక్ల , మంజు శుక్ల దంపతులకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన ఈమె బయోటెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ నృత్య కార్యక్రమాలలో పాల్గొనే ఈమె “మధ్యప్రదేశ్ డాన్స్ ఐడల్” అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది.
చిత్రా శుక్ల నటించిన తెలుగు సినిమాలు..
మోడల్ గా పనిచేస్తున్న సమయంలో అనేక టెలివిజన్, వెబ్ ప్రకటనలో కూడా పాల్గొనింది. 2016లో నేను శైలజ సినిమాలో “క్రేజీ ఫీలింగ్” అనే పాటలో తొలిసారి కనిపించిన ఈమె, ఈ పాట ద్వారానే మా అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత రంగులరాట్నం సినిమాలో రాజ్ తరుణ్, సిల్లీ ఫెలోస్ సినిమాలో అల్లరి నరేష్ పక్కన నటించి పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు కాదల్ అనే ప్రేమ కథ చిత్రం తోపాటు శశి కుమార్ పక్కన నా నా అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.
View this post on Instagram