Brahmanandam..సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా ఎవరైనా సరే ముందుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేముందు ఏ పాత్రతో అయితే ప్రేక్షకులకు పరిచయం అవుతారో.. అదే పాత్రలో వారికి అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఎలాంటి పాత్రలలో చేయాలి..? ఏ పాత్ర చేస్తే కెరీర్ కు ప్లస్ అవుతుంది..? అని ఆలోచించుకొని మరీ అడుగుపెడతారు.
దుర్యోధనుడి పాత్రలో డైలాగ్స్ తో అదరగొట్టేసిన బ్రహ్మానందం..
అయితే మరి కొంతమంది ఒకే పాత్రలో దశాబ్దాల కాలం పాటు కొనసాగుతూ.. అప్పుడప్పుడు వారిలో ఉండే ఇంకొక టాలెంట్ బయటపడితే.. అరే వీరిలో ఇంత టాలెంట్ ఉందా.. ఇదంతా మనం చూడలేదే.. అంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా బ్రహ్మానందం (Brahmanandam )విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి బ్రహ్మానందం నవ్వించడమే కాదు ఏడిపించగలరు కూడా.. అంతేకాదు అద్భుతంగా డైలాగులు చెప్పి ఆకట్టుకుంటారు కూడా అని తాజాగా నిరూపణ అయింది. అసలు విషయంలోకి వెళితే తాజాగా బ్రహ్మానందం దుర్యోధనుడి గెటప్ లో.. ఆయన చెబుతున్న డైలాగ్స్ చూసి అందరూ ఇంత గొప్ప టాలెంట్ గా మనం ఇన్ని రోజులు దూరం పెట్టింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కామెడీకే పరిమితం చేసి తప్పు చేశారా..
కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న బ్రహ్మానందం తన సినీ కెరియర్లో 1100 కు పైగా చిత్రాలలో కమెడియన్ గా పనిచేసి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే అనారోగ్య దృష్ట్యా వయసు మీద పడడం కారణంగా గత కొన్నాళ్లుగా అడపాదడపా మాత్రమే చిత్రాలలో చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయన ఎక్కువగా కామెడీ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. మంచి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉత్సవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాటకాల ఆధారిత కథగా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 13వ తేదీన విడుదల కాబోతోంది. రాజేంద్రప్రసాద్, మధుబాల, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
బ్రహ్మానందం డైలాగ్స్ కి ఆడియన్స్ ఫిదా..
మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించగా ఇందులో బ్రహ్మానందం కూడా ఈవెంట్ కి హాజరయ్యారు. అయితే ఈవెంట్లో.. సినిమాలో బ్రహ్మానందం దుర్యోధనుడి వేషం వేసి , డైలాగ్ చెప్పిన వీడియోని ఇక్కడ నిర్వాహకులు ప్లే చేస్తారు. దుర్యోధనుడి గెటప్ వేసుకున్న బ్రహ్మానందం అద్భుతమైన డైలాగ్స్ తో అదరగొట్టేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులంతా కూడా బ్రహ్మానందంలో ఈ టాలెంట్ కూడా దాగి ఉందా.. అయ్యో మనం ఆయనను కామెడీ పాత్రలకే పరిమితం చేసి తప్పు చేశామా అంటూ నిట్టూరుస్తున్నారు.
బ్రహ్మానందంలో హిడెన్ టాలెంట్..
ఇకపోతే బ్రహ్మానందం కమెడియన్ మాత్రమే కాదు గొప్ప నటుడు కూడా.. ఇటీవలే రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తూ వచ్చిన రంగమార్తాండ చిత్రంలో కూడా ఎమోషనల్ పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరొకసారి ఉత్సవం సినిమాలో నాటకాలు వేసే వ్యక్తిగా దుర్యోధనుడి పాత్రలో అదరగొట్టబోతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా బ్రహ్మానందంలో దాగి ఉన్న ఈ హిడెన్ టాలెంట్ కి అందరూ ఫిదా అవుతున్నారు.
#UtsavamMovie బ్రహ్మానందం గారిని మనం కామెడీ పాత్రలకే పరిమితం చేసి తప్పు చేసావేమో? pic.twitter.com/cMrMIuhQ9Y
— devipriya (@sairaaj44) September 10, 2024