Jabardasth Show : టెలివిజన్‌లో జబర్దస్త్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫేమస్ అవుతున్న కమెడియన్లు చాలా వరకు ఈ బుల్లితెర కామెడీ షో నుంచే వచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఎదిగిన కమెడియన్లు అందరూ ఈ షో నుంచి వెళ్లిపోవడం, కొత్త కమెడియన్లు పెద్దగా లేకపోవడంతో, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలను కలిపి ఒకే షోగా రన్ చేస్తున్నారు. దీనికి కృష్ణ భగవాన్, కుష్బూ జడ్జీలుగా ఉండగా, రష్మీ యాంకర్. అయితే రీసెంట్ గా వచ్చిన ప్రోమోలో కృష్ణ భగవాన్ కనిపించలేదు. ఆయన ప్లేస్‌లో కొత్త జడ్జీ దర్శనమిచ్చారు. ఆయన ఎవరో, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
గతంలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో అీంటూ రెండు షోలు ఉండేవి. ఇప్పుడు ఆ రెండు షోలను కలిపి జబర్దస్త్ అనే షో చేస్తున్నా… దీనికి ఆడియన్స్ ఇచ్చే ప్రాధాన్యత అయితే ఏం తగ్గలేదు. అలాగే జడ్జీలుగా ఉన్న కృష్ణ భగవాన్, కుష్బూ ల నుంచి కూడా కామెడీ వచ్చింది. అయితే తాజాగా వచ్చిన జబర్దస్త్ ప్రోమోలో కృష్ణ భగవాన్ కనిపిచంలేదు. ఆయన స్థానంలో కొత్త జడ్జీ వచ్చారు అంటూ పరిచయం చేశారు. ఆయన ఎవరో కాదు… ఒకప్పటి హీరో, ఇటీవల బిగ్ బాస్ తెలుగు 7 లో టాప్ 5 వరకు వెళ్లిన శివాజీ.
బిగ్ బాస్ వెళ్లిన తర్వాత శివాజీ కాస్త స్లోగా ఉంటున్నా.. దానికి ముందు పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా, ఫైర్ బ్రాండ్‌గా ఉండే వాళ్లు. అపరేషన్ గరుడ అంటూ కొన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ స్పీచ్ లు ఇచ్చే వాడు. అలాగే, మరో పార్టీకి బహిరంగంగా సపొర్ట్ చేసే వాడు. ఆ టైంలో శివాజీ యాక్టిగ్ ఫిల్డ్ వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్తాడని, ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. కానీ, తర్వాత ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి, అక్కడ పెద్దన్న పాత్ర పోషించడమే కాకుండా, పల్లవి ప్రశాంత్ గెలుపునకు సాయం కూడా చేశాడు.
ఇటీవల 90ఎస్ అనే వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ కు కనిపించిన శివాజీ ఇప్పుడు జబర్దస్త్ షోతో మరోసారి వారంలో రెండు సార్లు ఆడియన్స్ కు కనిపించబోతున్నాడు. ఇక లెటెస్ట్ గా వచ్చిన ప్రోమో చూస్తే, శివాజీ కామెడీ టైమింగ్ కృష్ణ భగవన్ లానే ఉందని అనిపిస్తుంది. గ్యాప్ వస్తే పంచ్ లు వేస్తూ ఎంరటర్టైన్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం యాంకర్ రష్మీ ఉండగా, జడ్జీలుగా శివాజీ, కుష్బూ ఉన్నారు.
ఆ ముగ్గురు వెళ్లిపోయాకా…
ఈ షో నుంచి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ టీం వెళ్లిపోయాకా.. షో టీఆర్పీ రేటింగ్ పై చాలా ప్రభావం చూపించింది. ఈ ముగ్గురిలో సుధీర్, శ్రీను ఇతర షోలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ ప్రసాద్ కూడా ఇతర షోలు చేస్తున్నా.. జబర్దస్త్ ను విడలేదు. కాగా, ఇప్పుడు ప్రసారమవుతున్న షోలో మొత్తం 6 టీంలు ఉన్నాయి.