Bigg Boss 8 Promo : బిగ్ బాస్ మళ్లీ 8వ సీజన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పుడే పదవ రోజుకు చేరుకుంది. ఇక పదవ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని తాజాగా కొన్ని నిమిషాల క్రితం షేర్ చేశారు నిర్వాహకులు. నిజానికి ఇందులో పెడుతున్న టాస్కులు చూస్తుంటే అటు కంటెస్టెంట్స్ ఏమో కానీ చూస్తున్న ఆడియన్స్ లో ఉత్కంఠత పెరుగుతోంది అని చెప్పవచ్చు. నిన్నటి వరకు నామినేషన్స్ లో భాగంగా రంగుపడుద్ది అంటూ నామినేషన్స్ పూర్తి చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు “లెమన్ పిజ్జా “అంటూ సరికొత్త టాస్క్ తో అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.
వారానికి సరిపడా రేషన్..
అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎంత టెన్షన్ అయితే పడ్డారో.. ఈ టాస్క్ చూస్తున్నంత సేపు ఆడియన్స్ కూడా అంతే టెన్షన్ పడ్డారని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదల అయిన ప్రోమో విషయానికి వస్తే.. ముందుగా ఇంటి చీఫ్స్ గా ఉన్న యష్మీ , నైనిక, నిఖిల్ లను వారానికి సరిపడా ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్ ను గెలుచుకోవడానికి యాక్షన్ ఏరియాలో ఉంచిన బిగ్ బాస్ సూపర్ మార్కెట్ పెట్టబడింది. వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్స్ బాధ్యత అంటూ బజర్ మోగించగానే యశ్మీ, తర్వాత నైనిక, ఆ తర్వాత నిఖిల్ ముగ్గురు వారానికి సరిపడా రేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
లెమన్ పిజ్జా అంటూ కొత్త టాస్క్..
ఆ తర్వాత లెమన్ పిజ్జా అంటూ టాస్క్ మొదలుపెట్టారు. ఏ క్లాన్ లో అయితే మూడు నిమ్మకాయలను ముందుగా బయటకు తీసి ఎక్కువ రౌండ్స్ ని గెలుస్తారో.. ఆ క్లాన్ విజేతలుగా నిలిచి.. వారు షాపింగ్ చేసిన వస్తువులను పొందుతారు అంటూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.అందులో భాగంగానే ఇందులో నిఖిల్ – నాగమణికంఠ, పృథ్వీ శెట్టి – అభయ్, సీత – నబీల్ ఆఫ్రిది మూడు గ్యాంగులుగా విడిపోయి గేమ్ ఆడారు. గేమ్ మొదలైనప్పటి నుంచి ఆడియన్స్ నరాలు బిగబట్టి మరీ గేమ్ వీక్షించారని చెప్పవచ్చు. చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ గేమ్ నిజంగానే షో ప్రారంభం కాకముందు నాగార్జున చెప్పిన లిమిట్ లెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇలాంటి టాస్క్ లు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాదు కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇస్తాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
వినోదానికి లిమిట్ లెస్..
ఇక టాస్క్ విషయానికి వస్తే.. ఆడుతున్న కంటెస్టెంట్స్ తో పాటు ఎంకరేజ్ చేస్తున్న కంటెస్టెంట్స్ కూడా తెగ టెన్షన్ పడిపోతున్నట్లు మనం చూడవచ్చు. ఇక చివర్లో నిఖిల్, నాగమణికంఠ టాస్క్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నరాలు సైతం బిగుసుకుపోయేలా ఇలాంటి ట్విస్ట్ లు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయని చెప్పవచ్చు. లిమిట్ లెస్ అంటూ నాగార్జున చెప్పినట్టుగానే ఊహించని టాస్క్‌లతో ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచుతున్నారు బిగ్ బాస్. ఇకపోతే మొదటి ప్రోమో విడుదలైన సందర్భంగా అప్పుడే.. క్షణాలలో 2.2 K లైకులు రావడం గమనార్హం.