Raj Tharun : టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ (Raj Tharun ), లావణ్య ( Lavanya ) పేర్లు హాట్ టాపిక్ అయ్యాయి. వీరిద్దరి వ్యవహారం అనేక మలుపులు తిరిగిన సంగతి అందరికీ విధితమే. అయితే ఈ విషయంపై లావణ్య పోలీసులను ఆశ్రయించి 2008 నుంచి తనకు రాజ్ తరుణ్ తో పరిచయం ఉందని, పెళ్లి కూడా చేసుకుంటానని, 2016 లో గర్భం దాల్చిన అబార్షన్ కూడా చేయించాడని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఆమె పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టి సంచలన విషయాలను బయట పెట్టారు. ఒకవైపు లావణ్య ప్రూఫ్ లతో సహా రాజ్ తరుణ్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నా కూడా రాజ్ తరుణ్ వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఈవెంట్ లో పచ్చిగా మాట్లాడాడు అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
హీరో రాజ్ తరుణ్ పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నా కూడా మరోవైపు సినిమాల ఫోకస్ పెట్టాడు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే అతడు కొద్ది రోజుల వ్యవధిలోనే ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామీ’ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. భలే ఉన్నాడే సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో రాజ్ తరుణ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అలా అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపించాడు. ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం ఓ డైరెక్టర్ నాకు కథ వినిపించడానికి వచ్చాడు. అతడు హీరోయిన్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు మీరేళ్లి కప్లింగ్ చేస్తారు అని చెప్పాడు..
ఇది కంప్లీట్ గా రొమాంటిక్ స్టోరీ అని చెప్పిన డైరెక్టర్ కు షాక్ ఇచ్చినట్లు అతను చెప్పాడు. నాకు అతడు కథ చెప్పగానే నేను ఒక్కటే మాట అన్నాను. నేను సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాను. బ్లూఫిల్మ్‌లు కాదు అని అతడికి చెప్పేశా అంటూ రాజ్ తరుణ్ వివరించాడు. ఇప్పుడు అతడు చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.. భలే ఉన్నాడే సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ కాబోతుంది. అందుకే ప్రమోషన్స్ గట్టిగానే టీమ్ చేస్తున్నారు. మొన్న వచ్చిన రెండు సినిమాలు షాక్ ఇచ్చాయి. ఈ సినిమా ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇక రాజ్ తరుణ్ పై , లావణ్య చేసిన ఆరోపణలు నిజమే అని పోలీసులు నిర్దారించారు. అతన్ని అరెస్ట్ చేస్తారనే వాదన కూడా వినిపిస్తుంది. అలాగే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు. ఈ కేసు ఇంకా కొనసాగుతుంది. చివరకు ఎం జరుగుతుందో చూడాలి..