Naga Chaithanya – Shobitha : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది మూడు రోజులు అవుతున్నా కూడా వీరిపై ట్రోలింగ్ ఆగలేదు. అటు నాగ చైతన్య ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద వార్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే సడెన్ గా ఎంగేజ్మెంట్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతుంది. తాజాగా ఈ విషయం పై అక్కినేని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.. ఆ ఒక్క కారణం వల్లే త్వరగా ఎంగేజ్మెంట్ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి..
శోభిత – నాగ చైతన్య ఎంగేజ్మెంట్..
నాగ చైతన్యకు గతంలో పెళ్లి హీరోయిన్ సమంతతో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కొన్ని మనస్పర్థలు రావడంతో ఇద్దరు నాలుగేళ్లు కాపురం చేశాక విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు ఒంటరిగానే ఉన్నారు. ప్రేమ పెళ్లి అని విడాకులు తీసుకున్న ఈ జంట ఇప్పుడు వేరువేరుగా ఉంటూ సినిమాలు చేస్తున్నారు. అయితే నాగ చైతన్య బాలీవుడ్ బ్యూటీ శోభిత దూలిపాళ్ళతో రిలేషన్ లో ఉంటూ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సమంత ఫ్యాన్స్ కూడా వీరిపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. కానీ వీళ్లు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
ఎంగేజ్మెంట్ ను జరిపించడానికి కారణాలను బయటపెట్టిన నాగార్జున..
నాగచైతన్య, శోభితా ఎంగేజ్మెంట్ ను ఎటువంటి హడావిడి లేకుండా జరిగిపోయింది. ఈ వేడుకను అక్కినేని కుటుంబం నిర్వహించింది. పెద్దగా అతిథులను కూడా ఆహ్వానించలేదు. అయితే, తన కుమారుడి ఎంగేజ్‍మెంట్‍ను అంత హడావుడిగా చేసేందుకు కారణమేంటో నాగార్జున తాజాగా చెప్పుకొచ్చాడు. ఆగస్టు 8వ తేదీన మంచి ముహూర్తం ఉన్నందుకే అప్పటికప్పుడు నాగచైతన్య – శోభితా ఎంగేజ్‍మెంట్ నిర్వహించామని ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పారు. సమంత వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిన చైతూ ఇప్పుడే హ్యాపీగా ఉన్నాడని నాగ్ అన్నాడు.. చైతన్య కంటే శోభితా నాకు ముందు తెలుసంటే ఆశ్చర్యపోతారేమో. నాకు ఆరేళ్లుగా ఆమె తెలుసు. రెండేళ్ల క్రితమే చైతన్యకు శోభితా పరిచయం అయ్యారు. శోభిత అన్ని తెలిసిన అమ్మాయి అందుకే నేను కూడా పెళ్లికి ఒప్పేసుకున్న అని నాగ్ చెప్పాడు.. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలిపారు. నాగార్జున అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో సమంత ఫ్యాన్స్ ఓ రేంజులో ఆడేసుకుంటున్నాడు. ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. నాగార్జున , నాగచైతన్య అప్ కమింగ్ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. అటు శోభిత కూడా సినిమాలు , వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది.