Allu Arjun : టాలీవుడ్ యంగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) సినిమాల కన్నా ఎక్కువగా వార్తల్లో హైలెట్ అవుతున్నాడు. రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మొన్నటివరకు మెగా vs అల్లు అంటూ ట్రోల్స్ ఓ రేంజులో ఉన్నాయి. మెగా ఫ్యామిలీతో గొడవలు అందుకు కారణం రాజకీయాలే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఎవ్వరూ స్పందించలేదు. అది అవ్వగానే ఇప్పుడు మరోకటి.. మొత్తంగా చూసుకుంటే మనోడికి ఎన్నికల తర్వాత వరుసగా షాక్ లు తగులుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో న్యూస్ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ కు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో గురించి ఓ లుక్ వేసుకుందాం పదండీ..
మెగా vs అల్లు ఫ్యామిలీకి గొడవలు..
ఈ మధ్య మెగా హీరోలకు , అల్లు అర్జున్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య ఓ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) మాట్లాడుతూ సినిమాల్లో హీరోలు ఎర్ర చందనం స్మగ్లర్లుగా నటించడమేంటని, సమాజానికి ఎటువంటి సంకేతాలు వెళతాయంటూ ప్రశ్నించారు. కచ్చితంగా బన్నీని ఉద్దేశించే మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున అక్కడినుంచి పోటీచేస్తున్న కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం చేయడంతో మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి..
అల్లు అర్జున్ కు స్కూల్ పిల్లలు ఫ్యాన్స్..
అల్లు అర్జున్ కు సంబందించిన ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదో షార్ట్ వీడియో.. ఆ వీడియోలో అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ తో ముచ్చటిస్తాడు. ఆ క్రమంలో ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ సీరియస్ అయినట్లు కనిపిస్తుంది. నిజానికి ఒక వ్యక్తి స్కూల్ పిల్లోడిని పక్కకు నెట్టినట్లు కనిపిస్తుంది. దానికి రియాక్ట్ అయిన బన్నీ ఆ వ్యక్తి పై సీరియస్ అవుతాడు. కుర్రోడిని నెట్టేస్తావేంటి.. అస్సలు ఊరుకోను అన్నాడు. దానికి ఆ వ్యక్తి అడ్డం జరగమని అడిగాను అంతే అని సమాధానం చెబుతాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో పై స్కూల్ పిల్లలను యాడ్ చేసి ఒక మీమ్ తయారు చేశారు. దీని వల్లే భాయ్ కి స్కూల్ పిల్లలు ఫ్యాన్స్ పెరుగుతున్నారంటు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి షార్ట్ వీడియో వైరల్ అవుతుంది మీరు ఒక లుక్ వేసుకోండి..
పుష్ప 2 వాయిదా పడే అవకాశాలు..
అల్లు అర్జున్,సుకుమార్ (Sukumar ) కాంబోలో వస్తున్నా లేటెస్ట్ మూవీ పుష్ప 2 విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్.. డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పినా కూడా షూటింగ్ అప్డేట్ రాలేదు. డైరెక్టర్, విలన్ గొడవలే ఆలస్యానికి కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంక రెండు నెలలు ఉంది.. ఆ లోపు మిగిలిన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేస్తారా లేక విడుదల మరోసారి వాయిదా పడుతుందా చూడాలి.. ఇక ఈ మూవీలో రష్మీక మందన్న ( Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది.