Devara.. జనతా గ్యారేజ్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది. అలా కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR ) హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. రెండవ భాగాన్ని ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో సినిమా పూర్తయిన తర్వాత మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ముంబైలో నిన్న సాయంత్రం చాలా ఘనంగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ కొన్ని వర్గాల వారిని విపరీతంగా ఆకట్టుకుంటుంటే మరి కొంతమంది పని కట్టుకొని మరీ ఇందులో నెగటివ్ వెతుకుతూ తెగ హైలెట్ చేస్తున్నారు. ఒకవేళ నెగిటివిటీ గనుక ఎక్కువ స్ప్రెడ్ అయితే రాజమౌళి సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.
దేవర కి భార్యగా మరాఠి హీరోయిన్..
ఇకపోతే తాజాగా ట్రైలర్ విడుదలైన తర్వాత దేవర క్యారెక్టర్ కి హీరోయిన్ ఉంటుందా? లేదా..? అసలు దేవర క్యారెక్టర్ కి హీరోయిన్ ఉన్నట్టు చూపించలేదు. కానీ దేవర పాత్రకి కూడా హీరోయిన్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. దేవర పాత్రకి మరాఠీ భాషకు చెందిన శృతి మరాఠీ( Shruti marathe)హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఆమె క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో దేవర పాత్ర చనిపోయినట్టుగానే ఇంటర్వెల్ వరకు చూపిస్తారట. అయితే ఆ తర్వాత ఆ పాత్ర ఇంకా బ్రతికే ఉందా..? లేక చనిపోయిందా..? అనే సస్పెన్స్ తో ఆడియన్స్ చివరి వరకు చూసేలా స్క్రీన్ ప్లే తీర్చిదిద్దినట్లు సమాచారం. చివరి 40 నిమిషాలు కొరటాల శివ తన విశ్వరూపం చూపించేశాడని, ఇక ఆ సన్నివేశాలు తనకు బాగా నచ్చాయి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
విడుదలకు ముందు దుర్గా మాత పాట..
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన కెరియర్ లోనే ది బెస్ట్ అనిపించే విధంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారని తెలుస్తోంది. ఇప్పటికే అనిరుద్ అందించిన మూడు పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. త్వరలోనే ఆయుధ పూజ పాటను కూడా విడుదల చేస్తారట. ఇక సినిమా విడుదలకు వారం రోజుల ముందు ఆన్లైన్లో ఈ పాటను వదులుతామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ పాట కూడా హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ పాటను ఎన్టీఆర్ మీద చిత్రీకరించినట్లు సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యే ముందే ఈ పాటను వదలబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పాట ఈ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుంది ..?అడ్వాన్స్ బుకింగ్ కి బూస్ట్ ఇస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.