Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో రెండో వారం నామినేషన్స్ పేరుతో హౌస్లో పెద్ద రచ్చే చేశారు. మొదటివారం బేబక్క ( Bebakka ) ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ మెట్స్ కు ఒక భయం పట్టుకుంది. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే స్వార్థం బాగా పెరిగిపోయింది. అందుకే ఈ వారం నామినేషన్స్ లో తమకన్నా స్ట్రాంగ్ ఉన్న వారిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. నిన్నటి ఎపిసోడ్ మాత్రం హైలెట్ అనే చెప్పాలి. నామినేషన్స్ వరకు నువ్వా నేనా అని మాటల యుద్ధం చేసిన హౌస్ మెట్స్ ఫుడ్ కోసం తెగ హడావుడి చేశారు. ఇక ఫుడ్ ఉండదు అని కక్కుర్తి పడి మరి తిన్నారు. అది కాస్త ట్రోల్స్ అందుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్ హైలెట్స్ ను ఒకసారి చూసేద్దాం..
గత వారం ఎపిసోడ్స్ తో పోలిస్తే ఈ వారం టఫ్ గా మారింది. మొత్తానికి ఈ రెండో వారంలో.. మణికంఠ (Manikanta ) , పృథ్వీ (Pruthvi ), ఆదిత్య Adhitya ), నిఖిల్ (Nikhil ), సీత ( Sita), శేఖర్ బాషా, నయనిక, విష్ణు ప్రియలు నామినేట్ అయ్యారు. ఇక కంటెస్టెంట్లకు ఇచ్చిన రేషన్ మొత్తాన్ని బిగ్ బాస్ లాగేసుకున్నాడు. ఇకపై ఏం తినాలన్నా.. వండుకోవాలన్నా.. సొంతంగా సంపాదించుకోవాలని చెప్పాడు. ఈ పదో ఎపిసోడ్ ఎలా సాగిందో ఒకసారి చూసేద్దాం..
మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ తో మొదలైంది.. సీత, సోనియా వార్ ఓ రేంజులో ఉన్నది.. అటు ఆదిత్య కూడా తగ్గలేదు. మణికంఠ శేఖర్ భాష లు కూడా చిన్న పాయింట్ తీసుకొని నామినేట్ చేశారు. నిఖిల్ హౌస్ కు చీఫ్ గా ఫెయిల్ అయ్యాడని, ఫుడ్ అందరికీ ప్రిపేర్ చేసి పెట్టేలా టీంను చూసుకోలేదని, లంచ్ ప్రిపరేషన్ జరగలేదనే కారణాలు చెప్పి ప్రేరణ నామినేట్ చేసేసింది. అలాగే సీతను నామినేట్ చేస్తూ.. వాగ్వాదం చేస్తూనే ఉంటావ్.. ఎదుటి వాళ్లని మాట్లాడనివ్వవు.. ఎదుటి వాళ్లు చెప్పింది వినవు.. టాస్కుల్లో క్లారిటీ ఉండదు.. డస్ట్ బిన్లోంచి తీసింది.. ఇది ఫీల్ అవ్వాల్సింది నేను.. అంటూ ప్రేరణ కారణాలు చెప్పింది. అక్కడ ప్రేరణ చెప్పిన దానికి సీత ఒప్పుకోలేదు.. నా తప్పు లేదని, నాకు క్లారిటీ ఉందని.. రైట్ అనిపిస్తే.. నేను పోరాడుతా.. వంద మందితో అయినా సరే పోరాడతాను వెనక్కి తగ్గను అని .. సీత సోనియా కూడా గట్టిగా వేసుకున్నారు. మొత్తానికి ఈ వారం నామినేషన్ లో ఒక్క యష్మీ తప్ప అందరు అయ్యారు.
హౌస్ లో ఫుడ్ కోసం హంగామా..
నామినేషన్స్ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ హౌస్ మెట్స్ కు స్వీట్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే హౌస్ మెట్స్ అందరి కోసం బిగ్ బాస్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపించారు. కొంత సమయం ఇచ్చి ఈరోజు మీకు ఏం కావాలాన్నా తినండి. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం అని చెప్పగానే. అందరు ఫుడ్ మీద పడ్డారు. ఆవురావురమణి తిన్నారు. అది కాస్త ప్రేక్షకులకు చిరాగ్గా అనిపించింది. ఇక నెటిజన్స్ మాత్రం ఫుడ్ కోసమే బిగ్ బాస్ కొచ్చినట్లు ఆ కక్కుర్తి ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారో ఆసక్తిగా మారింది..