Samyuktha Menon: పెళ్లయిన హీరోతో రిలేషన్‌లో సంయుక్త మీనన్? టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ దక్కించుకుంటారు. అలాంటి వారిలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) ఒకరు. ఈ బ్యూటీ పాప్ కాన్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళంలో, తమిళంలో, తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.
భీమ్లా నాయక్ సినిమాతో (Bheemla Nayak ) టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త (Samyuktha Menon) బింబిసారా, విరూపాక్ష, సార్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం సంయుక్త వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన జతకట్టే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. కేవలం సినిమాలోనే కాకుండా సంయుక్త సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటది. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. Samyukta Menon affair with married hero
అయితే సంయుక్తకు క్రేజ్ పెరిగిన కొద్దీ రూమర్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సంయుక్త మీనన్ రీసెంట్ గా ఓ రూమర్ బారిన పడ్డారు. మొన్నటి వరకు సంయుక్త (Samyuktha Menon) త్రివిక్రమ్ తో (Trivikram) రిలేషన్ కొనసాగిస్తున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఓ తమిళ స్టార్ హీరోతో సంయుక్త ప్రేమాయణం నడుపుతుందని, ఆయనతో డేటింగ్ చేస్తున్నట్టు అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ హీరో ఇదివరకే ప్రేమ వివాహం చేసుకొని, తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి తమిళంలో ఓ సినిమాలో కలిసి నటించారట.
సమాచారం ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలోనే వీరు వివాహం చేసు కోబోతున్నారంటూ సోషల్ మీడియా లో ఓ చర్చ సాగుతోంది. Samyukta Menon
ఈ విషయం తెలిసే సంయుక్త అభిమానులు కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకోవడమేంటి, అది కూడా ఇదివరకే వివాహమైన ఓ హీరోని పెళ్లి చేసుకోవడం అవసరమా అని నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ పుట్టిన రోజు నేడు జరుపుకుంటున్నారు. ఈ తరుణం లోనే… సంయుక్త మీనన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్. Samyukta Menon