Sai Dharam Tej : సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. చాలా సందర్భాల్లో ఛారిటీలకు విరాళాలు కూడా ఇచ్చాడు. ఇటీవల తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బంది పడితే ఆయన వెంటనే స్పందించి సాయం చేసిన సంగతి తెలసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కు 20 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మెగా మేనల్లుడు మరోసారి తన మంచి తనాన్ని చాటుకున్నాడు. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 2 లక్షల సాయం చేశాడు. ఇచ్చిన మాట ఏంటి..? ఎవరికి సాయం చేశాడు అనేది ఇప్పుడు చూద్ధాం…
2019లో సాయి ధరమ్ తేజ్ తన బర్త్ డే సందర్భంగా విజయవాడలోని అమ్మ ఆశ్రమానికి సొంత భవనాన్ని కట్టిస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే 2021లో అమ్మ ఆశ్రమానికి సొంత భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. అంతే కాదు, మూడేళ్ల పాటు ఆ అమ్మ అనాథ ఆశ్రమాన్ని దత్తత తీసుకుని, ఆశ్రమంలోని అన్ని ఖర్చులను సాయి ధరమ్ తేజ్ భరించాడు. అప్పుడు ఈ మెగా మేనల్లుడు చేసిన సాయానికి ఎన్నో ప్రశంసలు అందాయి. భవిష్యత్తులో కూడా అమ్మ అనాథాశ్రమానికి సాయం చేస్తూనే ఉంటానని ప్రకటించాడు.
ఇచ్చిన మాట ప్రకారం సాయి ధరమ్ తేజ మరోసారి తన దయా గుణం చాటుకున్నాడు. ఈ రోజు ఈ రోజు విజయవాడ చేరుకున్న సాయి దుర్గతేజ్ మొదట శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అమ్మ అనాథశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు.
SUPREME AT HEART❤️
Hero @IamSaiDharamTej fulfills his promise to “Amma Prema Adarana Old Age Home” in Vijayawada🙏#SaiDurghaTej handed over a Rs. 5 lakh check to @ammapremaadarana and other organizations!👏
He personally spent time with the elderly residents and inquired… pic.twitter.com/P1cLRx5zt5
— Filmify Official (@FilmifyTelugu) September 11, 2024
సాయి ధరమ్ తేజ తర్వాత సినిమాలు
వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మెగా మేనల్లుడు, మొదటి సారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిది మాత్రం పిల్లా నువ్వులేని జీవితం. ఈ సినిమాకి సాయి ధరమ్ తేజ్ కి బెస్ట్ డెబ్యూ హీరోగా సైమా అవార్డు కూడా వచ్చింది. సాయి ధరమ్ తేజ్ లాస్ట్ మూవీ బ్రో. పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వలేదు అనిపించింది. అయితే, సాయి ధరమ్ తేజ్ నుంచి దీని తర్వాత గంజా శంకర్ అనే మూవీ రావాల్సింది. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. గతంలో ఓ కార్యక్రమంలో కూడా సాయి ధరమ్ తేజ్ దీనిపై స్పందించలేదు. అయితే ఇప్పుడు ఈ మెగా మేనల్లుడు ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీని దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. దీనిపై అప్డేట్స్ త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది.