Pooja Hegde : టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే ( Pooja Hegde) గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు ఆమె దగ్గరికి వచ్చాయి. కానీ మొదట్లో సరైన హిట్ టాక్ ను అందుకోలేకపోయింది. అల్లు అర్జున్ (Allu Arjun) డీజే సినిమాతో హాట్ బ్యూటీగా మారింది. ఆ తర్వాత అందాల ఆరాబోతకు అడ్డు లేకుండా చేసుకుంది.. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. కానీ ఆఫర్స్ మాత్రం ఆగడం లేదు. ఐరన్ లెగ్ హీరోయిన్ అయిన కూడా చేతిలో సినిమాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కిస్తుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
తాజాగా అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఎప్పుడూ బికినీ లో హాట్ గా కనిపించే ఈ అమ్మడు వినాయక చవితి సందర్బంగా ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. పూజా హెగ్డే తాజాగా అంబానీ ఇంట్లో గణేష్ పూజకు హాజరయింది. ట్రెడీషనల్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.. పర్ఫుల్ కలర్ డ్రెస్సులో పెద్ద జుంకాలతో చాలా కొత్తగా అందంగా కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఓ రేంజులో ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీరు ఓ లుక్ వేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్స్ చెయ్యండి.
ఇక ఈ అమ్మడు కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం సౌత్ లో ఒకే ఒక్క సినిమా మాత్రమే హీరో సూర్య ( Suria) తో చేస్తుంది. అలాగే హిందీలో మరో సినిమా చేస్తుంది. దాని తర్వాత ఇపుడు పూజా హెగ్డే చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలో వరుస బ్లాక్ బస్టర్ లు ఇండస్ట్రీ షేకింగ్ హిట్స్ కొట్టిన పూజా హెగ్డే ఒక టైం కి వచ్చేసరికి ప్లాప్ హీరోస్ పాలిట హిట్ హీరోయిన్ అని కూడా పేరు తెచ్చుకుంది. కానీ 2022 లో వచ్చిన వరుస డిజాస్టర్ లు పూజాకి కొత్త ఆఫర్స్ ని దూరం చేశాయని చెప్పాలి. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) , సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu) లాంటి బిగ్ స్టార్స్ సినిమాల్లో ఓకే అయ్యి కూడా ఆ సినిమాల నుంచి ఆమెని తప్పించడం కెరీర్ పరంగా మరింత పెద్ద దెబ్బ అయ్యింది అని చెప్పాలి. మరి సూర్యతో చేసే సినిమా అయినా మంచి బ్రేక్ ఇచ్చి మళ్ళీ పూజాని బిజీ హీరోయిన్ గా మారుస్తుందేమో చూడాలి.. ఒక్క హిట్ పడితేనే నెక్స్ట్ కేరీర్ పీక్స్ లో ఉంటుంది. లేదంటే సినిమాలకు దూరం అవ్వాల్సిందే..