Biggboss season 7: బ్రేకింగ్: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి గుండెపోటు…

Biggboss season 7:

టెలివిజన్ లో బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ గురించి తెలిసిందే. తెలుగులో ఈ షో కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తుండగా, తమిళ్ లో కమల్ హాసన్, కన్నడ లో కిచ్చా సుదీప్, మలయాళం లో మోహన్ లాల్ హోస్ట్ గా ఉన్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 రీసెంట్ గా నెల కిందట స్టార్ట్ అవగా, తమిళ్ బిగ్ బాస్ అక్టోబర్ 1న స్టార్ట్ అయింది.

అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ కి గుండెపోటు వచ్చింది. అయితే అది తెలుగులో కాదు తమిళ్ లో. తమిళ్ బిగ్ బాస్ సీజన్ గత వారం మొదలవగా, అందులో ఒక కంటెస్టెంట్ గా ప్రముఖ రచయిత నటుడు ‘బావ చెల్లదురై’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో ఎంట్రీ కంటెస్టెంట్ లో ఎక్కువ వయసున్న వ్యక్తి ఈయనే.

అయన వయసు రీత్యా షో లో యాక్టీవ్ గా లేరని, అన్ని గేమ్స్ ఆడలేరని, ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఈ వారం చెల్లదురై ని నామినేట్ చేయగా, ఆయన చాలా బాధపడ్డారు. ఆ సమయంలో చెల్లదురై ఛాతిలో నొప్పి వస్తుందంటూ, బయటికి పంపించండి, నేను వెళ్ళిపోతా అంటూ షో నిర్వాహకులను వేడుకున్నాడు. దీంతో చేసేదేం లేక వారు బావ చెల్లదురై ని బయటికి తీసుకొచ్చారు.

- Advertisement -

అయితే ఇలా బిగ్ బాస్ లో మధ్యలోనుండి హౌస్ మేట్స్ బయటికి వచ్చేయడం కొత్తేమి కాదు, తమిళ్ లో సీజన్ 1,3,6,7 లలో ఆరుగురు బయటికి వచ్చారు. ఇక తెలుగు బిగ్ బాస్ షో లో ఫస్ట్ సీజన్లో సంపూర్ణేష్ బాబు ఆట ఆడలేక, హౌస్ లో ఉండలేనంటూ బయటికి పంపించండని పట్టుబట్టి మరీ బయటికి వచ్చేసాడు. కానీ బావ చెల్లదురై మాత్రం అనారోగ్య సమస్యతోనే బయటికి రావడం జరిగింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు