Biggboss season7: అనుకున్నదే జరిగింది.. భోలే ఎలిమినేటెడ్!

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా సాగుతుండగా, ఈ వారం పెద్దగా గొడవల్లేకుండా, హడావిడి లేకుండా సాగింది. ఎందుకంటే ఈ వారంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స కి సంబంధించిన ఫ్యామిలి మెంబర్స్ రావడం చేత బిగ్ బాస్ పెద్దగా టాస్క్ లు పెట్టలేదు. అయితే బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్క్ కూడా ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి వెళ్లిన తర్వాతే జరిగింది కాబట్టి, పెద్దగా టైం తీసుకోకుండా చిన్న టాస్క్ లే పెట్టాడు బిగ్ బాస్. అందులో అర్జున్, శివాజీ ఫైనలిస్ట్ లు గా రావడం జరిగింది.

అయితే తాజాగా ఎలిమినేషన్ డే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కువ మంది ఆడియన్స్ భోలే శావళి, లేదా అశ్విని ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం భోలే శావళి ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది.

అయితే భోలే ఎలిమినేట్ అవుతాడని చాలా మంది ఆడియన్స్ ఊహించారు. ఎందుకంటే గత లాస్ట్ వీక్ లో భోలే పెర్ఫార్మన్స్ చాలా వీక్ గా ఉంది. ఆటల్ని కూడా లైట్ తీసుకున్నాడు. ముఖ్యంగా తన వైఫ్ వచ్చినప్పుడు కూడా కప్ కొడతానని మాట వరుసకు కూడా అనలేదు. అంటే హౌస్ లో కూడా వారితో చివరిదాకా ఉంటానని కూడా అనలేదు. అందుకే భోలే ఫాలోవర్లు కూడా ఈయనని లైట్ తీసుకున్నట్టున్నారు. అయితే భోలే తర్వాత నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అశ్విని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు