Anand Devarakonda: బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తో సంబంధం లేదు

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా చిన్న సినిమాల హడావిడి ఎక్కువైంది. గత వారం అరడజనుకి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవగా ఒక్కటి కూడా సరిగా ఆడలేదు. ఇక ఈ వారం మూడు చిత్రాలు రిలీజ్ అవగా, అందులో క్రేజీ అంచనాలతో వచ్చింది “బేబీ” సినిమా. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై14న విడుదలై మిక్సిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ సాధించింది. విడుదలైన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఒక్కసారి ఏరియా వైస్ కలెక్షన్లను గమనిస్తే…

నైజాం 1.20 కోట్లు, సీడెడ్ 31లక్షలు, ఆంధ్ర 1.09 కోట్లు షేర్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 2.60 కోట్ల షేర్ 4.65 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 10లక్షలు, ఓవర్సీస్ లో 78లక్షలు వచ్చాయి. విడుదలైన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా “బేబీ” సినిమాకి 3.48 కోట్ల షేర్ వసూలుచేయగా, 6.55 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

- Advertisement -

ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 8కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 4.52 కోట్లు వసూలు చేస్తే సరిపోతుంది. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా, యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతుండడంతో వీకెండ్ లోనే ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు