Pawan kalyan: బ్రో సెకండ్ సింగల్ టైం ఫిక్స్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న బ్రో సినిమాకి సంబంధించి ఆడియో సాంగ్స్ సందడి మొదలైంది. ఇటీవలనే ఈ సినిమాలోని మై డియర్ మార్కండేయ సాంగ్ రిలీజ్ అవ్వగా, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ను అందుకుంది.

యాక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని రెండవ పాటను ఈరోజు రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ టీం ప్రకటించింది. ఇటీవలనే రిలీజ్ చేసిన పోస్టర్ లో డేట్ ఒకటే మెన్షన్ చేయగా, ఇప్పుడు టైం కూడా లాక్ చేసింది మూవీ టీం. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలోని జాణవులే అంటూ సాగె ఒక రొమాంటిక్ సాంగ్ ను ఈరోజు మధ్యాహ్నం,3 గంటలకు రిలీజ్ చేయబోతునట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. తిరుపతి లోని ఎన్వి ఆర్ జయశ్యాం థియేటర్ లో గ్రాండ్ గా ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

ఎమోషన్ ఫన్ & ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన సహకారం అందించగా, మ్యూజిక్ సెన్సేషన్ థమన్ స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మోడరన్ దేవుడి పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, పవన్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

- Advertisement -

\Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు