Maruthi Nagar Subramanyam Review :’మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ రివ్యూ..

Maruthi Nagar Subramanyam :అల్లు అర్జున్ .. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఇష్టమొచ్చినట్టు వాగి, సినిమా పేరు చెప్పడం మర్చిపోవడం వల్ల ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ :

సుబ్రమణ్యం (రావు రమేష్) కి చిన్నప్పటి నుండి ఓ డ్రీం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది అతని తీరని కోరిక. మారుతి నగర్..లో నివసించే ఇతను పోలీసు ఉద్యోగానికి తప్ప మిగతా గర్వర్న్మెంట్ ఉద్యోగాలన్నిటికీ అప్లై చేస్తాడు.ఒక దశలో ఇతనికి టీచర్ జాబ్ వస్తుంది. కానీ కోర్టు స్టే వల్ల అది పెండింగ్‌లో పడుతుంది. దీంతో అతను ఎటువంటి ఉద్యోగం చేయకుండా …భార్య కళారాణి (ఇంద్రజ) పై అదరపడతాడు. ఆమె ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీని పోషిస్తుంటుంది.మరోపక్క సుబ్రహ్మణ్యం తల్లి (అన్నపూర్ణ) ఇతనికి డబ్బులు ఇస్తుంటుంది. అయితే తర్వాత ఆమె మరణిస్తుంది. అదే టైంలో ఆమె డబ్బుని దుబారా ఖర్చు పెట్టినందుకు భార్య తిడుతుంది. అటు తర్వాత సుబ్రహ్మణ్యం తల్లి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి ఆమె వెళ్తుంది కళ. అయితే ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఖాతాలో ఊహించని విధంగా పది లక్షలు జమ అవుతాయి? అతని ఖాతాలో డబ్బులు వేసింది ఎవరు. ఆ డబ్బుతో సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? అతని కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) వల్ల సుబ్రహ్మణ్యంకి వచ్చిన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ

విశ్లేషణ :

పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు లక్ష్మణ్ బి, సి సెంటర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఈ సినిమా తీసాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినా.. కామెడీ మ్యానేజ్ చేసేసింది. కొన్ని చోట్ల ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండాఫ్ లో కొన్ని లెంగ్తీ సీన్లు పడ్డాయి. అందువల్ల ప్రేక్షకులు చీటికీ మాటికీ మొబైల్ చూసుకోవాల్సిన పరిస్థితి. ప్రవీణ్, జబర్దస్త్ నూకరాజు ..ల కామెడీ ట్రాక్స్ సహజత్వానికి దూరంగా ఉండటమే కాకుండా ఎక్కువ నిడివి ఉన్న ఫీలింగ్ ను కలిగిస్తాయి. అంకిత్ కొయ్య – రమ్య పసుపులేటి..ల ట్రాక్ అయితే మరింత విసిగించింది. దర్శకుడు కొత్త పాయింట్ తీసుకుని.. కేవలం కామెడీతోనే నెట్టుకురావాలని ప్రయత్నించాడు. రావు రమేష్ కామెడీకి మాస్ ఆడియన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి.. వాళ్లకి ఇది పర్వాలేదు అనిపించొచ్చు. కానీ మిగిలిన వాళ్ళకి కష్టమే. సాంకేతికంగా చూసుకుంటే.. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బడ్జెట్ ను కంట్రోల్లో పెట్టుకోవడానికి సినిమాటోగ్రాఫర్ ని ఎక్కువగా వాడుకున్నారేమో అనిపిస్తుంది. పాటలు ఉన్నాయి. అవి ఆకట్టుకునే విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సో సోగా ఉంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. నిర్మాణ విలువలు పెద్దగా గుర్తుపెట్టుకుని విధంగా లేవు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. రావు రమేష్ నటన గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏముంది. ఎప్పటిలానే తన నేచురల్ యాక్టింగ్ తో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ సినిమాకి ప్రధాన బలం అతనే. అయితే సినిమాలో నాన్ స్టాప్ గా చూడటం వల్ల కావచ్చు… రావు రమేష్ ఇంకా ఎంత సేపు ఉంటాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంద్రజ కొత్తగా చేసింది ఏమీ లేదు. ఆమె పాత్రకి కూడా కొత్తగా నటించే ఆస్కారం కనిపించదు. అంకిత్ కొయ్య కొంతవరకు ఓకే. రమ్య పసుపులేటి కొన్ని చోట్ల గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె హీరోయిన్ మెటీరియల్ లా అయితే అనిపించదు. హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ ..ల నటన ఓకే.

ప్లస్ పాయింట్స్ :

రావు రమేష్

కామెడీ

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
లాజిక్ లెస్ సీన్స్
స్క్రీన్ ప్లే

మొత్తంగా.. ఈ ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ కొన్ని చోట్ల నవ్విస్తాడు. చాలా చోట్ల విసిగిస్తాడు. ఓటీటీలో అయితే టైం పాస్ కి చూడొచ్చు కానీ, థియేటర్లలో అయితే భరించడం కష్టం.

రేటింగ్ : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు