అన్ స్టాపబుల్

ఆహా, ఈ తెలుగు ఓటిటి ప్లాట్ఫ్రామ్ గురించి తెలియని వారు లేరు.
అగ్ర నిర్మాత అల్లుఅరవింద్ గారు ఒక తెలుగు ఓటిటి ప్లాట్ఫ్రామ్ ను లాంచ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది “అహా” అని వెటకారంగా పెదవి విరిచారు. కానీ ఈ ప్లాట్ఫ్రామ్ లో ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు, జరుగుతున్న రియాలిటీ షోస్ చూస్తుంటే “ఆహా’ అని ఆశ్చర్యపడుతున్నారు. ప్రతి వారం ఒక కొత్త సినిమా దీనిలో రిలీజ్ అవ్వడం. అలానే మలయాళంలో సూపర్ హిట్ అయినా సినిమాలను తెలుగులో అందించడం సినీ ప్రేమికులకు , ప్రేక్షకులకి ఆనందం కలిగించిన విషయం.

కరోనా తర్వాత ఓటీటీల ఆదరణ వీపరీతంగా పెరిగింది. వెబ్‌సిరీస్‌, సినిమాలు, స్పెషల్‌ షోలతో ఓటీటీలు ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. వీటన్నటిమించి “ఆహా” మరొక స్టెప్ ముందుకు వేసింది 30 కి పైగా బ్లాక్‌బస్టర్‌ హాలీవుడ్‌ సినిమాలను ఆహా లో అందించనున్నట్లు ప్రకటించింది.

‘అనకొండ’, ‘బ్యాడ్‌ బాయ్స్‌ 2’, ‘చార్లీస్‌ ఏంజెల్స్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘టెర్మినేటర్‌’, ‘రెసిడెంట్‌ ఈవిల్‌’, ‘బ్లాక్‌ హాస్‌ డౌన్‌’ సహా చాలా సినిమాలు ఆహాలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతివారం లానే ఆహా లో మే 6న మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘దొంగాట’ స్ట్రీమింగ్‌ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు