OTT : ఇకపై ఉచితంగా మహేష్ సినిమా

ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా, ఓటీటీలోకి రావాల్సిందే. కొన్ని సినిమాలు మూడు వారాలకు వస్తే, మరి కొన్ని నాలుగు వారాలకు వస్తాయి. కానీ, రావడం మాత్రం పక్క. ఇది ఓటీటీ లవర్స్ ఎప్పుడూ చెప్పే డైలాగ్. అయితే, ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల నిర్మాతలు ఓటీటీని కూడా క్యాష్ చేసుకుంటున్నారు. పే పర్ వ్యూ రెంటల్ పద్దతిలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కేజీఎఫ్-2 తో పాటు ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా రెంటల్ పద్దతిలోనే ఓటీటీలోకి వచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట, థియేట్రికల్ రన్ ఉన్న సమయంలోనే, ఈ నెల 2న ఓటీటీలోకి రెంటల్ పద్దతిలో వచ్చింది. దీని వల్ల మైత్రీ మూవీ మేకర్స్ కు ఎంత లాభం వచ్చిందో తెలియదు కానీ, ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకులు ఉచితంగా చూసే తేదీని ప్రకటించింది. ఈ నెల 23 నుండి సర్కారు వారి పాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉచితంగా ప్రసారమవుతుందని అధికారిక ప్రకటన చేసింది.

ఈ సినిమా ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. నిజానికి తెలుగుతో పాటు తమిళంలో కూడా ‘సర్కారు వారి పాట’ ను ఏక కాలంలో థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ కరోనా కారణంగా షూటింగ్ కు అంతరాయం కలగడం, తర్వాత టికెట్ ధరలకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వడంతో తమిళ్ వెర్షన్ పై ‘సర్కారు వారి’ టీం ఫోకస్ పెట్టలేకపోయాందని తెలుస్తుంది. అయితే ఓటీటీలో విడుదలైనంత మాత్రాన, మిగిలిన భాషలకు చెందిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారా అన్నది పెద్ద ప్రశ్న.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు