Deepika Padukone: ఆ వార్తలో నిజం లేదు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం
“ప్రాజెక్ట్ కే”. మహానటి సినిమా తరువాత దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమా చేయడం, అందులోను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చెయ్యడం వలన “ప్రాజెక్ట్ కే” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

“ప్రాజెక్ట్ కే” సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ షూటింగ్ లో ఉన్న ఆమె రెండు రోజులు క్రితం అస్వస్థతకు గురైనట్లు. హార్ట్ బీట్ పెరగడంతో ఆమెను హుటాహుటిన కామినేని ఆసుపత్రికి తరలించినట్టు, సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసాయి.

అయితే “దీపిక ఆసుపత్రికి వెళ్లిన మాట వాస్తవమే. కానీ ఇది సాధారణ తనిఖీ మాత్రమే. హృతిక్ రోషన్‌తో తన తదుపరి చిత్రం కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకోనుంది. అందుకే, ఆమె తన ఫిట్‌నెస్ విధానం మరియు డైట్‌పై వైద్యుల నుండి సలహా తీసుకునే నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం దీపికా “ప్రాజెక్ట్ కే” పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు