OTT : వర్కౌట్ అయ్యే పనేనా ?

ఓటీటీ రిలీజ్ ల విషయంపై టాలీవుడ్ నిర్మాత‌లు కీల‌క సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇక కొత్త సినిమాల‌ను 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాలిని నిర్ణయం తీసుకున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. జూలై 1 నుండి ఈ నిర్ణయం అమలైవుతుందని తెలిపారు.

ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్ కు రావడం తగ్గించారు. దీనికి కారణం ఓటీటీలే అని చెప్పొచ్చు. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని వల్ల డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేటర్ వ్యవస్థను కాపాడుకోవచ్చు అని నిర్మాతలు చెబుతున్నారు.
అంతా బాగానే ఉంది. కానీ ఇది వర్కౌట్ అయ్యే పనేనా. అన్నది పెద్ద ప్రశ్న.

ఎందుకంటే, ఓ సినిమాకు పెట్టే బడ్జెట్ ను నిర్మాత తిరిగి డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో సాధ్యమైనంత వరకు రాబట్టుకోగలుగుతున్నాడు. వీటి ద్వారానే లాభాలు మూటకట్టుకుంటున్నారు అని చెప్పొచ్చు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు కూడా కోట్లకు కోట్లు పెట్టి డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. ఒకవేళ సినిమాకు ప్లాప్ టాక్ వస్తే ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న రేటు కంటే కాస్త ఎక్కువ ఇచ్చి, త్వరగా స్ట్రీమింగ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక్కడ వాళ్లకు లాభాలు వస్తాయా లేదా అన్నది పక్కన పెడితే, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కు ఏదైనా అడ్జస్ట్ చేయాల్సి వస్తే ఇందులో చేస్తున్నాడు. అలాగే చిన్న సినిమాలకు ఓటీటీ సంస్థలే కల్ప వృక్షాలు గా మారిపోయాయి. మంచి టాక్ వచ్చినా, మంచి రివ్యూలు వచ్చినా ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసి హక్కులను దక్కించుకుంటున్నాయి. ఓటీటీ బిజినెస్ దెబ్బ తినడం వల్ల నిర్మాతకే నష్టం అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ రేట్లు పెట్టి డిజిటల్ సంస్థలు సినిమా హక్కులను కొనుగోలు చేయవు. మరి ఈ విషయం పై నిర్మాతల మండలి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు