Megastar : మెగాస్టార్ అల్లుడు ఓటీటీకే

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా మారి “విజేత” అనే చిత్రం చేశాడు. 2018 లో విడుదలైన ఈ సినిమా నిరాశ పర్చింది. దీని తర్వాత రెండో సినిమా చేయడానికి కళ్యాణ్ దేవ్ చాలా గ్యాప్ తీసుకున్నారు. “సూపర్ మచ్చి” తో రెండో సారి హీరోగా వచ్చినా, పెద్ద ఫలితం దక్కలేదు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల అయ్యింది. మెగా ఫ్యామిలీ నుండి ఎవ్వరూ ఈ సినిమాని పుష్ చేయలేదు. దాంతో ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా జనాలకి తెలీదు. అది ఎందుకు అన్నది, ఇప్పుడు అప్రస్తుతం.  కళ్యాణ్ దేవ్ కు థియేట్రికల్ లేదు అనేది వాస్తవం.

కళ్యాణ్ దేవ్ నటించిన మూడో చిత్రం “కిన్నెరసాని” కి కూడా థియేట్రికల్ బిజినెస్ ఏమీ జరగలేదు. దాంతో మేకర్స్ ఓటిటికి ఫ్యాన్సీ రేటుకి ఇచ్చేశారు. జీ5 వారు ఈ చిత్రం ఓటిటి హక్కులను దక్కించుకున్నారు. జూన్ 10 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. “అశ్వద్ధామ” వంటి యావరేజ్ చిత్రాన్ని అందించిన  రమణ తేజ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్.ఆర్. టి ఎంటర్టెన్మెంట్ బ్యానర్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు