Jagapathi Babu : జగపతి బాబు ది ఫారెస్ట్ మ్యాన్

టాలీవుడ్ లో హీరోలు విలన్ పాత్రలు వేయడం కొత్తమీ కాదు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలు ప్రతినాయకుడు పాత్రలు వేశారు. అందరిలో జగపతి బాబు స్టైలే వేరు. హీరోగా సరైన హిట్స్ పడని క్రమంలో జగపతి బాబు విలన్ పాత్రల వైపు అడుగులు వేశాడు. నందమూరి బాలయ్య “లెజెండ్” సినిమాతో తొలి సారి ప్రతి నాయకుడి పాత్రలో జగపతి బాబు కనిపించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కెరీర్ మారిపోయింది.

వరుసగా విలన్ అవకాశాలు జగపతి బాబుకు క్యూ కడుతున్నాయి. “లెజెండ్” నుండి నేటి “గని” సినిమా వరకు ఆయన యాక్టింగ్ లెవెల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీంతో హీరో పాత్రల వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. 2017 లో “పటేల్ సర్” అనే ఓ సినిమా చేయగా, తాజా గా మరో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు.

సంపత్ నంది అందించిన స్టోరీతో మురళి మనోహర్ దర్శకత్వంలో “సింబా ది ఫారెస్ట్ మ్యాన్” సినిమా వస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రకృతి తల్లి కుమారుడు ఇతడు అంటూ క్యాప్షన్ వేసి ట్విట్టర్ వేదికగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

- Advertisement -

చెట్లు లేని చోట  జగపతి బాబు, చెట్లను తీసుకురావడం కాస్త ఆసక్తికర అంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు